న్యూఢిల్లీ: పార్లమెంటులో శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ సందర్భంగా ఆమె ప్రసంగం చేసిన సమయం రికార్డుల్లోకి ఎక్కింది. పార్లమెంటులో రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. 2 గంటల 39 నిమిషాలపాటు ప్రసంగించారు. గతంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన వారికన్నా నిర్మలా ప్రసంగ సమయం ఎక్కువగా ఉండటం గమనార్హం.

తొలి బడ్జెట్ 39 పేరాల్లోనే..
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1947, నవంబర్ 27న పార్లమెంటులో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు అప్పటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం చెట్టి. అనాటి బడ్జెట్ 39 పేరాల్లోనే పొందుపర్చడం గమనార్హం. ఈ బడ్జెట్ దేశ సమగ్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ఆ తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్ల నిడివి, ప్రసంగ సమయం పెరుగుతూ వచ్చింది.

గతంలో మన్మోహన్ ప్రసంగమే పెద్దది..
1991లో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దేశ ఆర్థిక సంస్కరణలకు కీలకమైన ఈ బడ్జెట్ నిడివి 18,650 పదాలు. అప్పటి వరకు మన్మోహన్ సింగ్ ప్రసంగ సమయమే పెద్దదిగా ఉంది. ఆ తర్వాత 200లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి జశ్వంత్ సింగ్ ప్రసంగ సమయం 2 గంటల 13 నిమిషాలుగా ఉంది.

8సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రణబ్.. జైట్లీ తర్వాతే
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కేంద్ర ఆర్థిక మంత్రిగా పార్లమెంటులో ఎనిమిదిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం గమనార్హం. ఆయన బడ్జెట్ ప్రసంగాల్లో సగటున 202 పేరాలు ఉన్నాయి. 2012లో ప్రణబ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిడివి 220 పేరాలు. కాగా, పేరాలు, పదాల విషయంలో అరుణ్ జైట్లీ తర్వాత ప్రణబ్‌దే రికార్డు. యూపీఏ ప్రభుత్వ హాయంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేసని పీ చిదంబరం 9సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆయన ప్రసంగంలో సగటున 173 పేరాలు ఉన్నాయి. కాగా, అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రుల్లో మొరార్జీ దేశాయ్ తర్వాత స్థానం చిదంబరందే కావడం గమనార్హం. మొరార్జీ దేశాయ్ పది బడ్జెట్లు ప్రవేశపెట్టారు.

అరుణ్ జైట్లీ రికార్డు..
2018లో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీ ప్రసంగ సమయం 109 నిమిషాలుగా ఉంది. ఆ బడ్జెట్ ప్రసంగంలో 18,604 పదాలు ఉపయోగించారు. అధిక పేరాలతో ఉన్న బడ్జెట్ ప్రసంగం చదివిన మంత్రిగా అరుణ్ జైట్లీ రికార్డుల్లోకి ఎక్కారు. 2015లో ఆయన ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్ ప్రసంగం 2గంటలపాటు, 2017లో ఆయన బడ్జెట్ ప్రసంగం 110 నిమిషాలపాటు కొనసాగింది.

నిర్మలా సీతారామన్ కొత్త రికార్డ్..
ఇక నిర్మలా సీతారామన్ పార్లమెంటో రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2019లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా చేసిన ప్రసంగ సమయం చాలా పెద్దదే. 2గంటల 17 నిమిషాలపాటు ఆమె ప్రసంగం కొనసాగింది. ఇక 2020-21 బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా నిర్మలా సీతారామన్ ఏకంగా 2 గంటల 39 నిమిషాలపాటు తన ప్రసంగాన్ని కొనసాగించారు. పార్లమెంటులో అత్యధిక సమయంపాటు బడ్జెట్‌పై ప్రసంగం చేసిన ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications