న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించారు. శనివారం ఉదయం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా పార్లమెంటులో ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా కొత్త వ్యక్తిగత ఆదాయపన్నుల శ్లాబులను ప్రకటించారు. మధ్య, ఎగువ మధ్య తరగతివారికి ఊరటనిచ్చేలా ఈ శ్లాబులు ఉండటం గమనార్హం.
కొత్త పన్ను శ్లాబ్స్ ఇలా..
ఆదాయం రూ. 5లక్షల నుంచి 7.5లక్షలు ఉన్న వారికి 10 శాతం పన్ను
రూ. 7.5లక్షల నుంచి 10 లక్షల వరకూ 15 శాతం పన్ను
రూ. 10 లక్షల నుంచి రూ. 12.5లక్షల వరకూ 20 శాతం పన్ను వర్తిస్తుందని
రూ. 12.5 లక్షల ఆదాయం వరకూ 25 శాతం పన్ను ఉంటుందనికేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

మినహాయింపులు రావు..
రూ. 15 లక్షల ఆదాయం కంటే ఎక్కువగా ఉంటే 30శాతం పన్ను చెల్లించాల్సిందిగా మంత్రి చెప్పారు. కొత్త ఆదాయం పన్ను విధానం ఐఛ్చికం అని తెలిపారు. మినహాయింపులు పొందాలా? వద్దా? అన్నది వేతన జీవులపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. దీంతో పాత విధానంతోపాటు కొత్త విధానం కూడా అమల్లో ఉంటుంది. కొత్త పన్ను విధానం ఎంచుకుంటే 80(సీ) కింద వచ్చే మినహాయింపులు ఉండవు.

సామాన్యుడికి భారీ ఊరట..
కాగా, ప్రత్యక్ష పన్నుల విధానంలో భారీ సంస్కరణలు తీసుకొచ్చామని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి పన్ను లేదు. ఇది వేతన జీవులకు నిజంగా తీపి కబురే అని చెప్పవచ్చు. సామాన్యుడు కోరుకున్న విధంగా పన్ను మినహాయించడంతో మధ్యతరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలావుంటే,చిన్న, మధ్య తరగతి వ్యాపారులకు ఏడాదిపాటు ట్యాక్స్ హాలిడే.. కంపెనీలపై డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ రద్దు.. రూ. 5 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకు ఆడిటింగ్ మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు.

ఎన్ఆర్ఐలకు అవకాశం..
ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 3.5 లక్షల కోట్ల మూలధన సాయం అందిస్తున్నట్లు తెలిపారు. డిపాజిట్ల సొమ్మును సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, కంపెనీ చట్టంలో మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. బ్యాంకింగేతర హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలకు అదనపు నిధులు కేటాయింపునకు కొత్త పథకం తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులకు ఎన్ఆర్ఐలకు అవకాశం కల్పిస్తున్నామని, ఆర్థిక ఒప్పందాల పర్యవేక్షణకు కొత్త తీసుకొస్తున్నట్లు వివరించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications