For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

BSNLలో మరో 20వేల కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ముప్పు

|

ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని యోచిస్తోందట. మరో ఇరవై వేలమంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించనుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఉద్యోగుల తొలగింపుకు సంబంధించి సెప్టెంబర్ ఫస్ట్‌న హ్యూమన్ రీసోర్సెస్ డైరెక్టర్ అనుమతితో ఉత్తర్వులు వచ్చాయని చెబుతున్నారు.

కాంట్రాక్ట్ పనులు, కాంట్రాక్ట్ కార్మికుల ఖర్చులు తగ్గించుకునే క్రమంలో చీఫ్ జనరల్ మేనేజర్లు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ముప్పైవేల మంది కార్మికులను తొలగించారని, వీరికి ఏడాది వేతనం చెల్లించాలని చెబుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీ తన నిర్ణయాన్ని సమీక్షించాలని కోరుతున్నారు. స్వచ్చంధ పదవీ విరమణ పథకం(వీఆర్ఎస్) అమలు అనంతరం సంస్థ ఆర్థిక పరిస్థితి క్షీణించిందని, దీంతో పాటు వివిధ నగరాల్లో ఉద్యోగుల కొరత కారణంగా నెట్ వర్క్‌లలో లోపాలు పెరిగాయని యూనియన్లు లేఖ రాశాయి.

కృష్ణపట్నం పోర్ట్‌లో భారీ అదానీ గ్రూప్‌కు భారీ వాటా, జగన్ ప్రభుత్వం ఓకేకృష్ణపట్నం పోర్ట్‌లో భారీ అదానీ గ్రూప్‌కు భారీ వాటా, జగన్ ప్రభుత్వం ఓకే

BSNL to retrench another 20,000 contract workers

రూ.900 కోట్ల విలువైన పెండింగ్ బకాయిలను బీఎస్ఎన్ఎల్ చెల్లించకుంటే ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ ప్రాజెక్టుల్లో పని చేస్తున్న ఉద్యోగులను తొలగిస్తామని గత నెలలో ఫిన్నిష్ టెలికం పరికరాల సంస్థ నోకియా స్పష్టం చేసింది. కరోనా కారణంగా ఖర్చులు తగ్గించడానికి ఇలాంటి చర్యలు తీసుకోవడం తప్ప మరో మార్గం లేదని పేర్కొంది. కాగా గత ఏడాది బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థల్ని విలీనం చేయడం, ఆస్తులను మోనటైజ్ చేయడం, ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించింది. ఇందుకు రూ.69వేల కోట్ల ప్యాకేజీని ప్రభుత్వం ఆమోదించింది.

English summary

BSNLలో మరో 20వేల కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ముప్పు | BSNL to retrench another 20,000 contract workers

The government has accelerated the efforts to privatise Bharat Sanchar Nigam Limited (BSNL) along with handful of other public sector undertakings ever since it came to power.
Story first published: Sunday, September 6, 2020, 10:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X