ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవ్వాళ లాభాలతో ఆరంభమైంది. స్టాక్స్ అన్నీ గ్రీన్‌జోన్‌లో ట్రేడింగ్ అవుతూ కనిపించాయి. తొలి గంటలో దాదాపుగా అన్ని సెగ్మెంట్స్‌కు చెందిన షేర్లన్నీ అప్పర్ సర్క్యుట్‌లో ట్రేడ్ కావడం కనిపించింది. సాయంత్రానికి సెన్సెక్స్, నిఫ్టీ భారీగా లాభపడే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. దీనికి అనుగుణంగానే- బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్స్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్ అవుతోంది.
వారం ప్రారంభంలో స్టాక్ మార్కెట్ సానుకూల వాతావరణంలో ఓపెన్ కావడం.. ఇన్వెస్టర్లల్లో ఆశలను రేకెత్తించినట్టయింది. ప్రారంభంలోనే 150 పాయింట్ల మేర లాభపడింది సెన్సెక్స్. క్రమంగా పెరుగుతూ పోయింది. తొలి గంటలో 217 పాయింట్ల మేర లాభపడి, 62,288.59 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ట్రేడింగ్ నమోదయింది. ఇన్వెస్టర్లు స్టాక్స్ కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల స్టాక్స్ ఏ దశలో కూడా సెన్సెక్స్ బలహీనపడలేదు.

కీలకమైన సెగ్మెంట్స్‌కు సంబంధించిన షేర్లన్నీ గ్రీన్‌జోన్‌లో ట్రేడింగ్ అయ్యాయి. ఇన్వెస్ట్‌మెంట్స్ వైపు దృష్టి పెట్టడం వల్ల ఇంట్రాడే మొత్తం పాజిటివ్‌గానే ఉంటుందనే సంకేతాలు స్టాక్ మార్కెట్స్ నుంచి వెలువడుతున్నాయి. నిఫ్టీ ట్రేడింగ్ కూడా స్వల్ప లాభంతోనే ఆరంభమైంది. శుక్రవారం సాయంత్రం 18,314.80 పాయింట్లతో ముగిసిన ట్రేడింగ్.. ఈ ఉదయం 18,339.30తో ఆరంభమైంది.
తొలి గంటలో ఫార్మాసూటికల్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆటోమొబైల్ సెగ్మెంట్స్‌కు చెందిన షేర్లు కొంతమేర లాభపడ్డాయి. పేటీఎం, టాటా మోటార్స్, ఐషర్, బ్రిటానియా టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. పేటీఎం 2.78 శాతం లాభపడింది. శుక్రవారం నాటితో పోల్చుకుంటే ఇవ్వాళ 20 రూపాయల మేర లాభపడింది. రూ. 707.40 పైసల వద్ద ట్రేడింగ్ అయింది. టాటా మోటార్స్ ఒక్కో షేర్ మీద రూ.15.65 పైసలు, ఐషర్ రూ.48.65 పైసలు, బ్రిటానియా రూ.58.50 పైసల మేర ట్రడింగ్ రికార్డయింది.
టాటా స్టీల్, టైటాన్, భారతి ఎయిర్‌టెల్, ఎల్ అండ్ టీ షేర్ల ధరలు కూడా పెరుగుదల బాట పట్టాయి. అదాని ఎంటర్‌ప్రైజెస్ భారీగా నష్టపోయింది. ఒక్కో షేర్ మీద రూ.68.95 పైసల మేర మైనస్‌తో ట్రేడింగ్ కావడడం కనిపించింది. ఒకదశలో 100 రూపాయలకు పైగా నష్టపోయినప్పటికీ.. మళ్లీ కోలుకోగలిగింది. తొలి గంటలో సన్ ఫార్మా లోయర్ సర్క్యుట్‌లోనే ట్రడింగ్ అయింది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications