సాంకేతిక సమస్యలకు సంబంధించి బీఎస్ఈ, ఎన్ఎస్ఈ కొత్త గైడ్ లైన్స్‌తో ముందుకు వచ్చాయి. ట్రేడింగ్ అవాంతరాలను నిరోధించేందుకు బ్రోకింగ్ సంస్థలు, ఇతర సభ్యుల సాంకేతిక వ్యవస్థల్లో లోపాలకు సంబంధించి స్టాక్ ఎక్స్చేంజీలు సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేశాయి. సభ్యులు తమ సాంకేతిక వ్యవస్థలో తలెత్తిన లోపాలపై నిర్దేశిత సమయంలో సమాచారం అందించాలని, లేని పక్షంలో ఎక్స్చేంజీకి రూ.20,000 చొప్పున చెల్లించవలసి ఉంటుందని స్టాక్ ఎక్స్చేంజీలు వేర్వేరుగా సర్క్యులర్‌ను జారీ చేశాయి.
టెక్నికల్ లోపాల కారణంగా ట్రేడింగ్ కార్యకలాపాలకు అవాంతరాలు కలగకుండా సభ్యులు ఏర్పాటు చేసుకోవాల్సిన టెక్నాలజీ మౌలిక వసతులు, వ్యవస్థకు సంబంధించి ఈ మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొంది. 2022 మార్చి నాటికి ఈ ఏర్పాట్లు అన్నీ పూర్తి కావాలని తేల్చి చెప్పింది. అంతేకాదు, సాంకేతిక లోపంపై సమాచారం అందించేందుకు వీలుగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను కూడా సూచించాయి.

ఇదిలా ఉండగా, మార్కెట్లు నిన్న భారీ నష్టాల్లో ముగిశాయి. ఒమిక్రాన్ భయాలు అంతర్జాతీయ, తదనుగుణంగా దేశీయ మార్కెట్లను కుప్పకూల్చాయి. హెచ్‌పీ అథెసివ్స్ ఇష్యూ నిన్న ముగిసింది. దీనికి 21 రెట్ల ఆదరణ లభించింది. రిటైల్ విభాగంలో 81.24 రెట్ల స్పందన వచ్చింది. సుప్రియా, లైఫ్ సైన్స్ ఐపీవో రెండో రోజు ముగింపుకు 5.69 రెట్ల స్పందన లభించింది. రిటైల్ విభాగంలో 25.38 రెట్లు అధికంగా బిడ్స్ వచ్చాయి. సోమవారంతో ఈ ఇష్యూ ముగుస్తుంది.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications