ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవ్వాళ లాభాలతో ముగిసింది. స్టాక్స్ అన్నీ గ్రీన్‌జోన్‌లో ట్రేడింగ్ అయ్యాయి. దాదాపుగా అన్ని సెగ్మెంట్స్‌కు చెందిన షేర్లన్నీ అప్పర్ సర్క్యుట్‌లో ట్రేడ్ అయ్యాయి. ఇన్వెస్టర్లకు లాభాల బాటను పండించాయి. వారం ప్రారంభ రోజున స్టాక్ మార్కెట్స్ కార్యకలాపాలు సానుకూలంగా ముగియడం.. ఆశలను రేకెత్తించింది. ఈ వారం అంతా మార్కెట్స్ లాభాల్లో ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.
బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో ఓపెనింగ్ సెషన్‌లో 150 పాయింట్ల మేర లాభపడింది సెన్సెక్స్. క్రమంగా పెరుగుతూ పోయింది. తొలి గంటలో 217 పాయింట్ల మేర లాభపడి, 62,288.59 పాయింట్ల వద్ద ట్రేడింగ్ నమోదయింది. ఇన్వెస్టర్లు స్టాక్స్ కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల స్టాక్స్ ఏ దశలో కూడా సెన్సెక్స్ బలహీనపడలేదు. కీలకమైన సెగ్మెంట్స్‌కు సంబంధించిన షేర్లన్నీ గ్రీన్‌జోన్‌లో ట్రేడింగ్ అయ్యాయి.

ఇన్వెస్ట్‌మెంట్స్ వైపు దృష్టి పెట్టడం వల్ల ఇంట్రాడే మొత్తం పాజిటివ్‌గా సాగింది. నిఫ్టీ ట్రేడింగ్ కూడా స్వల్ప లాభంతోనే ఆరంభమైంది. అదే స్థాయిలో లాభపడింది. ఫార్మాసూటికల్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆటోమొబైల్ సెగ్మెంట్స్‌కు చెందిన షేర్లు లాభపడ్డాయి. మధ్యాహ్నం ట్రేడింగ్ ముగిసే సమయానికి పేటీఎం, టాటా మోటార్స్, ఐషర్, బ్రిటానియా టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.
పేటీఎం 3.68 శాతం లాభపడింది. శుక్రవారం నాటితో పోల్చుకుంటే ఇవ్వాళ రూ.25.30 పైసల మేర లాభపడింది. రూ. 713.15 పైసల వద్ద ట్రేడింగ్ అయింది. ఒకదశలో 717 రూపాయల వరకు వెళ్లినప్పటికీ.. ఆ తరువాత తగ్గుముఖం పట్టింది. టాటా మోటార్స్ ఒక్కో షేర్ మీద రూ.14.60 పైసలు, ఐషర్ రూ.27.50 పైసలు, బ్రిటానియా రూ.9.50 పైసల మేర క్లోజింగ్ ట్రేడింగ్ రికార్డయింది.
పేటీఎం, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్‌తో పాటు ఐటీసీ, టెక్ మహీంద్ర, హిందుస్తాన్, ఎల్ అండ్ టీ, టాటా స్టీల్, మహీంద్ర అండ్ మహీంద్ర, విప్రో, ఇండస్‌ఇండ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, భారతి ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, అల్ట్రా సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టైటాన్, రిలయన్స్.. వంటి సంస్థలు లాభపడ్డాయి.

అదాని ఎంటర్‌ప్రైజెస్ భారీగా నష్టపోయింది. ఒక్కో షేర్ మీద రూ.54.70 పైసల మేర మైనస్‌తో ట్రేడింగ్ అయింది. ఒకదశలో 100 రూపాయలకు పైగా నష్టపోయినప్పటికీ.. మళ్లీ కోలుకోగలిగింది. అదాని గ్రూప్‌లోని అన్ని సంస్థలు కూడా దాదాపుగా నష్టాన్ని చవి చూశాయి. నెస్ట్లె ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్, సన్ ఫార్మా, ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, మారుతి వంటి కంపెనీలు నష్టపోయాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications