దేశీయ ప్రధాన స్టాక్ ఎక్స్చేంజీల్లో ఒకటైన ఎన్ఎస్ఈలో సోమవారం సాంకేతిక సమస్య తలెత్తింది. ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికి కొన్ని స్టాక్స్ ధరలు తెరపై అప్ డేట్ కాలేదని పలు బ్రోకరేజీ సంస్థలు ఎక్స్చేంజీ దృష్టికి తీసుకు వచ్చాయి. నిఫ్టీ సహా మరిన్ని ఇండెక్స్ ధరలు కూడా తెరపై కనిపించలేదని పేర్కొన్నాయి. గత ఏడాది కూడా ఇలాంటి సమస్య తలెత్తింది. 2021 ఫిబ్రవరి 24వ తేదీన టెక్నికల్ ఇ,్యూ కారణంగా ఎక్స్చేంజీని నాలుగు గంటల పాటు క్లోజ్ చేశారు.
ఇప్పుడు మరోసారి సమస్య తలెత్తింది. ఎన్ఎస్ఈ వినియోగిస్తున్న సాంకేతికత, ఆటోమేషన్ పైన అనుమానాలు వస్తున్నాయి. కాగా, సమస్యను గుర్తించగానే పరిష్కరించినట్లు ఎన్ఎస్ఈ స్పష్టం చేసింది. నిఫ్టీ బ్యాంకింగ్ నిఫ్టీలో అప్పుడప్పుడు ధరలు తెరపై అప్ డేట్ కాలేదని తెలిపింది. దీనిని పరిష్కరించినట్లు వెల్లడించింది. అన్ని సూచీలు సాధారణంగా పని చేస్తున్నాయని పేర్కొంది.

సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు ధరలు మాత్రమే అప్ డేట్ కాలేదని బ్రోకరేజీ సంస్థలు వెల్లడించాయి. అయితే ఆర్డర్లు మాత్రం ఎగ్జిక్యూట్ అయ్యాయని పేర్కొంది. డెరివేటివ్స్ విభాగం కూడా సాధారణంగా పని చేసినట్లు తెలిపారు. కో-లొకేషన్, ప్రాగ్జిమిటీ సర్వర్లు ఈ సమస్యను ఎదుర్కొన్నాయా లేదా కేవలం నాన్ కో-లొకేషన్ ట్రేడర్లు మాత్రమే ఇబ్బంది పడ్డారా విచారించాల్సి ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications