Reliance Power Stock: గతవారం స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీపై కఠిన చర్యలకు దిగింది. ఈ క్రమంలో చాలా మంది పెట్టుబడిదారులు భయంతో అనిల్ అంబానీకి చెంది లిస్టెడ్ కంపెనీల్లోని తమ వాటాలను అమ్మేస్తున్నారు.
గడచిన వారం ట్రేడింగ్ చివరిరోజైన శుక్రవారం అనిల్ అంబానీ నేతృత్వంలోని లిస్టెడ్ స్టాక్స్ పతనంతో ప్రయాణాన్ని ముగించాయి. అయితే సోమవారం మార్కెట్లలో ఇన్వెస్టర్లను ముందుకు నడిపేందుకు ఈ వార్త దోహదపడనుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కంపెనీ షేర్ల గురించే. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం పడిపోయి స్టాక్ ధర రూ.34.48కి చేరగా.. బీఎస్ఈలో రూ.34.45 వద్ద ముగిశాయి. వాస్తవానికి రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కంపెనీలో రుణాల పేరుతో నిధుల దుర్వినియోగం జరిగినట్లు సెబీ గుర్తించింది. దీంతో అనిల్ అంబానీతో పాటు మరో 24 మందిపై సెబీ ఐదేళ్లపాటు సెక్యూరిటీల మార్కెట్ నుంచి నిషేధించింది.

బ్రోకరేజ్ అభిప్రాయం..
టెక్నికల్ ఫ్రంట్‌లో కౌంటర్‌లో స్వల్పకాలిక మద్దతు రూ.35గా ఉంటుందని ప్రకటించింది. రిలయన్స్ పవర్ స్టాక్ సమీప కాలంలో టార్గెట్ ధర రూ.45 చేరుకునే అవకాశం ఉందని విశ్లేషకులు సూచించారు. రోజువారీ టెక్నికల్ చార్టుల్లో ఈ స్టాక్ బలంగా కనిపిస్తోంది. రూ.42 అప్‌సైడ్ టార్గెట్‌ను చేరుకోగలదని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (రిటైల్ రీసెర్చ్) రవి సింగ్ వెల్లడించారు. ఇదే క్రమంలో పెట్టుబడిదారులు స్టాప్ లాస్ ధరను రూ.35గా ఉంచుకోవాలని ఆయన చూసించారు. ఇదే క్రమంలో ఏంజెల్ వన్, సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ టెక్నికల్ అండ్ డెరివేటివ్స్ ఓషో కృష్ణన్ కంపెనీ షేర్లకు టార్గెట్ ధరను రూ.42-45 స్థాయిలకు చేరుకోవచ్చని అభిప్రాయపడ్డారు.
అనిల్ అంబానీపై చర్యలు..
కంపెనీ నుంచి నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ మాజీ కీలక అధికారులతో పాటు మరో 24 మందిని సెక్యూరిటీస్ మార్కెట్లలో పాల్గొనకుండా 5 ఏళ్ల పాటు నిషేధించింది. ఇదే క్రమంలో అనిల్ అంబానీపై రూ.25 కోట్ల ఆర్థిక జరిమానాను సైతం విధించింది. ఏదైనా లిస్టెడ్ కంపెనీ లేదా మార్కెట్ రెగ్యులేటర్‌తో రిజిస్టర్ చేయబడిన ఏదైనా సంస్థలో డైరెక్టర్ లేదా కీ మేనేజర్ పర్సనల్ (KMP)గా చేరకూడదని సెబీ తన ఆదేశాల్లో వెల్లడించింది.


Click it and Unblock the Notifications