Reliance Power: ఇటీవల కేంద్ర ప్రభుత్వం తన వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అనిల్ అంబానీకి చెందిన స్టాక్స్ పరుగులు తీస్తున్నాయి. ఈ క్రమంలో ఒకప్పుడు దివాలా తీసిన అనిల్ తిరిగి వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు చెందిన అనేక కంపెనీల స్టాక్స్ పెరుగుదలలో రాకెట్ వేగాన్ని మార్కెట్లో అందుకున్నాయి.
ఇటీవలి కాలంలో రిలయన్స్ పవర్ కంపెనీ షేర్లు మార్కెట్లో పుంజుకున్నాయి. బడ్జెట్ ప్రసంగం రోజున అంటే జూలైన 23, 2024న రిలయన్స్ పవర్ షేర్లు రూ.26.94 వద్ద క్లోజ్ అయ్యాయి. ఆ తర్వాత నిరంతరం కొత్త గరిష్ఠ స్థాయిలను నమోదు చేస్తూ స్టాక్ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో రిలయన్స్ అడాగ్ షేర్ల ధర రూ.26.94 నుంచి రూ.34.54 స్థాయికి పెరిగింది. కేవలం 5 ట్రేడింగ్ రోజుల్లోనే కంపెనీ షేర్ల ధర ఏకంగా 30 శాతం పెరుగుదలను నమోదు చేసింది.

ప్రస్తుతం రిలయన్స్ పవర్ రుణ రహిత సంస్థగా కొనసాగుతోంది. కంపెనీ రూ. 800 కోట్ల బకాయిలను క్లియర్ చేసింది మరియు రిలయన్స్ ADAG కంపెనీ FY2025లో ఇతర ప్రైవేట్ విద్యుత్ రంగ సంస్థలతో పోటీ పడుతుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. బడ్జెట్ ప్రయోజనాలు కంపెనీ బ్యాలెన్స్ షీట్‌ను మెరుగుపరుస్తాయని తెలుసతోంది. ఈ కారణాల వల్ల రిలయన్స్ పవర్ షేర్ల కొనుగోలుపై ఆసక్తి పెరిగింది. అయితే రుణ రహిత కంపెనీగా అవతరించిన తర్వాత, ఆర్డర్ బుక్ ఫ్రంట్‌లో కంపెనీ కఠినమైన సవాలును ఎదుర్కొంటోందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రాబోయే త్రైమాసికాల్లో ఇది స్పష్టంగా కనిపింతనుంది.
ఈ క్రమంలో రిలయన్స్ పవర్ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయిన కంపెనీ కాదని ప్రాఫిట్‌మార్ట్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అవినాష్ గోరక్షకర్ అన్నారు. కంపెనీ తన రూ.800 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించిందని, ఇప్పుడు స్వతంత్ర ప్రాతిపదికన రుణ రహిత సంస్థగా అవతరించిందని పేర్కొన్నారు. ఇదే సమయంలో కంపెనీ షేర్లపై ఛాయిస్ బ్రోకింగ్ మాత్రం బులిష్ వ్యూ కలిగి ఉన్నట్లు వెల్లడించింది. స్టాక్ రూ.32 వద్ద బలమైన సపోర్ట్ ఏర్పరుచున్నట్లు ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా అన్నారు. ఈ క్రమంలో రిలయన్స్ పవర్ షేర్‌హోల్డర్లు రూ.32 స్టాప్ లాస్‌తో షేర్లను రూ.40 టార్గెట్‌తో ఉంచుకోవాలని సూచించారు. అలాగే షేరు ధర రూ.32 దాటే వరకు కంపెనీ షేర్లపై బై-ఆన్-డిప్స్ వ్యూహాన్ని కొనసాగించవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications