డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 25 శాతం దిగుమతి సుంకాల నిర్ణయం భారత్ ఎగుమతిదారులకు పెద్ద షాకే. అయితే ఈ ఒత్తిడికి మాటలతో కాకుండా రూ 20,000 కోట్ల ప్రణాళికతో బదులివ్వాలని భారత ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఇటీవల ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ రష్యా నుంచి పెద్ద ఎత్తున నూనె కొంటోందని, దానిలో కొంత మొత్తం ప్రపంచ మార్కెట్లో అమ్మి లాభాలు సంపాదిస్తున్నదని ఆరోపించారు. "ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం జరుగుతున్నా, భారత్ లాభాలపై దృష్టి పెడుతోంది. అందుకే భారత ఉత్పత్తులపై నేను భారీ టారిఫ్ పెంచుతున్నాను" అని ఆయన Truth Social లో రాశారు. ఈ ప్రకటనల తర్వాత ఆగస్టు 7 నుంచి భారత్ వచ్చే ప్రతి వస్తువుపై అమెరికా 25% దిగుమతి సుంకం (టారిఫ్) విధించనుంది.
ఇది మనకు చిన్న విషయమేమీ కాదు. అమెరికా మన దేశానికి అతిపెద్ద ఎగుమతి మార్కెట్. సుమారు $85 బిలియన్ విలువైన వస్తువులు మనం అక్కడికి ఎగుమతి చేస్తున్నాం. ఇందులో సగానికి పైగా వస్తువులపై ప్రభావం పడే ప్రమాదం ఉంది.
ఒక ప్రణాళిక, ఒక దిశ వాణిజ్య పరంగా ఈ దెబ్బల నుంచి తప్పించుకునేందుకు భారత ప్రభుత్వం కొత్త దారులు వెతుకుతోంది. రూ. 20,000 కోట్లతో ఒక భారీ ప్రణాళికను రూపొందిస్తోంది అదే ఎగుమతి ప్రోత్సాహక మిషన్ (Export Promotion Mission).
ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రభుత్వం బ్రాండ్ ఇండియా పునాదులు వేయాలని చూస్తోంది. ఈ మిషన్‌లో చేర్చే ముఖ్య అంశాలు ఇవే. MSME ఎగుమతిదారులకు collateral లేకుండా రుణాలు. అంతర్జాతీయ మార్కెట్లో ఎదురయ్యే నాన్-టారిఫ్ అడ్డంకుల తొలగింపు. ఈ-కామర్స్ గోడౌన్లు, ట్రేడ్ సౌకర్యాలు. ప్రతి జిల్లా ఎగుమతి కేంద్రంగా మారేలా ప్రోత్సాహం. భారత ఉత్పత్తులకు 'బ్రాండ్ ఇండియా' గుర్తింపు. ఈ పనిలో వాణిజ్య, MSME, ఆర్థిక శాఖలు కలిసి పని చేస్తున్నాయి.
ఈ ప్రణాళిక సెప్టెంబర్ నాటికి అమలులోకి రావాలని అధికార వర్గాలు చెబుతున్నాయి.
జపాన్ అంటే నాణ్యత, కొరియా అంటే టెక్నాలజీ, స్విట్జర్లాండ్ అంటే ఖరీదైన గడియారాలు గుర్తొస్తాయి. అలాగే భారత ఉత్పత్తులు కూడా 'విశ్వాసాన్ని' కలిగించేలా చేయడమే ఈ ప్రణాళిక ఉద్దేశ్యం. ఎక్కడైనా "Made in India" అన్నా అది నాణ్యమైనదే అనే విశ్వాసం కలిగించాలన్నదే ఈ బ్రాండ్ ఇండియా లక్ష్యం.
ట్రంప్ వ్యాఖ్యలకు భారత విదేశాంగ శాఖ తక్షణమే స్పందించింది. "భారత్ తన ఆర్థిక, జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన ప్రతి చర్య తీసుకుంటుంది" అని స్పష్టం చేసింది. అమెరికా, యూరప్ దేశాలూ ఇప్పటికీ రష్యా నుంచి యురేనియం, ఫెర్టిలైజర్లు, కెమికల్స్ కొనుగోలు చేస్తూనే ఉన్నాయని పేర్కొంది.
ఇప్పటి పరిస్థితుల్లో దేశం ఎదురు చూస్తున్న ప్రధాన విషయం ఎగుమతులు ఆగిపోకూడదు,
అంతర్జాతీయ వాణిజ్యంలో మన స్థానం నిలదొక్కుకోవాలి. అందుకే ఈ రూ 20,000 కోట్ల ప్రణాళిక ఎగుమతిదారులకు ఒక ఊపిరి పీల్చే అవకాశం. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎగుమతి సంస్థ (FIEO) డైరెక్టర్ అజయ్ సహాయ్ వ్యాఖ్యలు దీన్ని బలపరుస్తున్నాయి "ఇలాంటి క్లిష్ట సమయంలో ఇటువంటి భారీ ప్రణాళిక ఎగుమతిదారులకు ఆశాజనకంగా మారుతుంది."
More From GoodReturns

Gold reserves: ఈ చిన్న దేశం కొంటున్న బంగారం చూస్తే కళ్లు చెదరాల్సిందే!

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?



Click it and Unblock the Notifications