కోవిడ్ -19: బుక్ మై షో కొత్త అవతారం ... పరిస్థితులకు తగ్గట్టు సరికొత్త సేవలు!

ఆన్లైన్ లో సినిమా టిక్కెట్లు బుక్ చేసుకునే సేవలు అందించే బుక్ మై షో సరికొత్త అవతారం ఎత్తబోతోంది. ఇప్పటి వరకు ఈ కంపెనీ కేవలం టిక్కెట్లు బుక్ చేసుకునే సేవలు మాత్రమే అందించేది. కానీ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తితో విధించిన లాక్ డౌన్ అన్ని రంగాలను ఇబ్బందికి గురిచేసినట్లే సినిమా రంగం కూడా దెబ్బతింది. సినిమా షూటింగ్ ల నుంచి సినిమా ప్రదర్శన వరకు అన్నిటిని నిషేధించడంతో ఆన్లైన్ లో టిక్కెట్ల బుకింగ్ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఈ రంగంలో ఉన్న అన్ని కంపెనీలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా దేశం మొత్తంమీద సినిమా టిక్కెట్ల ఆన్లైన్ బుకింగ్ లో రారాజుగా వెలుగొందుతున్న బుక్ మై షో పై ఈ ప్రభావం భారీగా పడింది.

ఇప్పటికే ఈ కంపెనీ మూవీ టిక్కెట్లతో పాటు ఈవెంట్లు, స్పోర్ట్స్ కు సంబంధించిన టిక్కెట్లను కూడా తన ప్లాట్‌ఫాం పై బుక్ చేసుకునే అవకాశం కల్పించి తన సేవలను భారీగా విస్తరించింది. అయితే, ప్రస్తుతం కేవలం సినిమాలు మాత్రమే కాదు, ఈవెంట్లు, స్పోర్ట్స్ అన్నిటిపైనా ఇంకా నిషేధం కొనసాగుతూనే ఉంది. ఇంకెంత కాలం ఇది కొనసాగుతుందో తెలియదు. ఒకవేళ మళ్ళీ సేవలు ప్రారంభమైనా ... గతంలో ఉన్నంత స్థాయిలో బిజినెస్ ఉంటుందా లేదా అన్న అనుమానాలు లేకపోలేదు.

ఇక పై లైవ్ స్ట్రీమింగ్...

ఇక పై లైవ్ స్ట్రీమింగ్...

టిక్కెట్ల బుకింగ్ నిలిచిపోవటంతో ... సరికొత్త సేవలపై బుక్ మై షో దృష్టిసారిస్తోంది. ఇందులో భాగంగా ఇకపై లైవ్ స్ట్రీమింగ్ సేవలను అందించాలని నిర్ణయించింది. రికార్డెడ్ ఈవెంట్స్, ఇతర కంటెంట్ ను ఆన్లైన్ లో బుక్ చేసుకుని, వెంటనే ఇంట్లోనే కూర్చొని చూసే వెసులుబాటు కల్పిస్తోంది. అంటే ఇది సరిగ్గా అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లాంటి సర్వీస్ అన్నమాట. కాకపోతే వాటిలో సినిమాలు వేస్తారు. బుక్ మై షో లో అయితే సిరీస్ లు, రికార్డెడ్ షో లు వంటి కంటెంట్ అందుబాటులో ఉంటుంది. ఇతర లైవ్ షో లను కూడా ప్రదర్శించే లా ఏర్పాట్లు చేసింది. ఇందులో మ్యూజిక్ కు సంబంధించినవి, ఆర్ట్స్, మోటివేషనల్ షో, యోగా, చిల్డ్రన్ కంటెంట్ కూడా ఉంటాయి. కరోనా వచ్చిన తర్వాత మీటింగ్స్ అన్నీ ఆన్లైన్ లో వెబినార్ లుగా మారిపోయాయి. దీంతో అలాంటి ఆన్లైన్ సమావేశాలను కూడా తన సరికొత్త సేవల్లో చేర్చింది బుక్ మై షో. ఆయా షో లకు ఉన్న డిమాండ్ ను బట్టి ధరలు రూ 99 నుంచి ప్రారంభం అవుతున్నాయి.

మార్పు తప్పదు...

మార్పు తప్పదు...

బుక్ మై షో అనే కంపెనీ దేశంలో విజయవంతమైన స్టార్టుప్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. 1999 లోనే ప్రారంభమైన ఈ సంస్థ ... కేవలం గత 10 ఏళ్లుగా మాత్రమే జనాలకు బాగా దగ్గరైంది. ఇంటర్నెట్ వాడకం పెరగటం, స్మార్ట్ ఫోన్ల రాకతో ఈ కంపెనీ సేవలకు గిరాకీ పెరిగింది. సినిమా టిక్కెట్లను ఆన్లైన్ లో ఎందుకు బుక్ చేస్తారు అని వెక్కిరించిన వారూ లేకపోలేదు. కానీ ఆ రంగంలో దేశంలో ఒకే ఒక్క బ్రాండ్ గా బుక్ మై షో నిలదొక్కుకుంది. ఈ రంగంలోకి అనేక కంపెనీలు ప్రవేశించినా ఏవి కూడా చివరి వరకు నిలబడలేకపోయాయి. దీంతో మూవీ టిక్కెట్ల సేవల్లో బుక్ మై షో ఏకచక్రాధిపత్యం కొనసాగుతోంది. ప్రారంభం నుంచి అనేక మార్పులను ఆహ్వానిస్తూ ముందుకు సాగుతున్న బుక్ మై షో ఇప్పుడు కూడా మరో కొత్త మార్పుకు వెల్కమ్ చెప్పి ముందుకు వెళుతోంది.

యునికార్న్ దిశగా ...

యునికార్న్ దిశగా ...

కంపెనీ ప్రారంభై 20 ఏళ్ళు పూర్తి కావటంతో పాటు మూవీ, ఈవెంట్ల టికెట్ బుకింగ్ లో తిరుగు లేని ఆధిపత్యం సాధించిన బుక్ మై షో... యునికార్న్ (1 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్) దిశగా సాగుతోంది. 2018 లోనే ఈ కంపెనీ కి 800 మిలియన్ డాలర్ల వాల్యుయేషన్ లభించింది. సైఫ్ పార్టనర్స్, టీపీజీ గ్రోత్, ఆక్సిల్ పార్టనర్స్ వంటి మార్కీ ఇన్వెస్టర్లు ఇందులో పెట్టుబడి పెట్టారు. కాగా, బుక్ మై షో లో సుమారు 1,450 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా... కరోనా వైరస్ కారణంగా కార్యకలాపాలు నిలిచిపోవటంతో సుమారు 270 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఖర్చులు తగ్గించుకోవటంలో భాగంగా తప్పనిసరి పరిస్థితిలో వీరిని తొలగించాల్సి వచ్చినట్లు కంపెనీ ఫౌండర్ ఆశిష్ హెమరాజని పేర్కొన్నారు. ఈ మేరకు మీడియా కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే, సరికొత్త సేవలతో బుక్ మై షో మళ్ళీ తన సత్తాను చాటనుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+