జోబిడెన్ సంతకం, 42,000 డాలర్లు దాటిన బిట్ కాయిన్
రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి దాదాపు తెరపడినట్లుగా కనిపిస్తోంది. అయితే రష్యా డిమాండ్లు, ఉక్రెయిన్ అంగీకారం పైన ఆధారపడి ఉంటుంది. అయితే నిన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెనుకడుగు వేసినట్లుగా వచ్చిన వార్తలు స్టాక్ మార్కెట్, బిట్ కాయిన్ దూకుడుకు పెంచగా, బులియన్ మార్కెట్ స్వల్పంగా క్షీణించడానికి కారణమైంది. ముఖ్యంగా డిజిటల్ అసెట్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన జోబిడెన్ సంతకం చేయడం క్రిప్టో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపరిచింది. గత నాలుగైదు రోజులుగా 40వేల డాలర్ల దిగువన ఉన్న క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ నేడు 42,000 డాలర్లు క్రాస్ చేసింది. క్రిప్టో మార్కెట్ అనూహ్యంగా పుంజుకుంది.
ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 42,367.81 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత 24 గంటల్లో 38,159 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 42,577 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. మార్కెట్ క్యాప్ 803.72 బిలియన్ డాలర్లు పెరిగింది. 52 వారాల గరిష్టం 68,990.90 డాలర్లు కాగా, కనిష్టం 28,825.76 డాలర్లు.

వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ విషయానికి వస్తే బిట్ కాయిన్ 11 శాతం లాభపడి 42,408 డాలర్ల వద్ద, ఎథేరియం 8.52 శాతం ఎగిసి 2752 డాలర్ల వద్ద, టెర్రా 26.40 శాతం ఎగిసి 104 డాలర్ల వద్ద, ఎక్స్‌ఆర్‌పీ 6.70 డాలర్లు ఎగిసి 0.764759 డాలర్ల వద్ద, సోలానా 8.47 డాలర్లు ఎగిసి 89.19 డాలర్ల వద్ద, అవాలాంచె 9.33 శాతం ఎగిసి 79 డాలర్ల వద్ద, కార్డనో 8.84 శాతం ఎగిసి 0.86 డాలర్ల వద్ద, పోల్కాడాట్ 7.72 శాతం ఎగిసి 18 డాలర్ల వద్ద, స్టెల్లార్ 11.51 శాతం ఎగిసి 0.788 డాలర్ల వద్ద, డోజీకాయిన్ 6.50 శాతం ఎగిసి 0.123 డాలర్ల వద్ద, పాలీగోన్ 7.26 శాతం ఎగిసి 1.53 డాలర్ల వద్ద, షిబా ఇను 6.16 శాతం ఎగిసి 0.000024 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications