39,000 డాలర్ల వద్ద బిట్ కాయిన్, క్రిప్టో మార్కెట్ పరుగు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం సమయంలో భారీగా నష్టపోయిన క్రిప్టో మార్కెట్ ఆ తర్వాత నుండి కోలుకుంది. 35,000 డాలర్లకు పడిపోయిన క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ ఇప్పుడు 40,000 డాలర్లకు సమీపంలో ఉంది. స్టెల్లార్ వంటి ఒకటి రెండు క్రిప్టోలు మినహా మిగతా అన్నీ లాభాల్లో ఉన్నాయి. బిట్ కాయిన్ గత 24 గంటల్లో 40,000 డాలర్లను తాకనప్పటికీ, 38,000 డాలర్ల దిగువకు మాత్రం పడిపోలేదు. రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలకు అవకాశాలు ఉండటం సానుకూలతకు కారణమైంది.
ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 39,567 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. గత ఇరవై నాలుగు గంటల్లో 38,235 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 39,679 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. 52 వారాల కనిష్టం 28,825.76 డాలర్లు, గరిష్టం 68,990.90 డాలర్లు. మార్కెట్ క్యాపిటలైజేషన్ 24 గంటల్లో 750.55 బిలియన్ డాలర్లు పెరిగింది.

ఇతర క్రిప్టోల విషయానికి వస్తే బిట్ కాయిన్ 1.75 శాతం లాభపడి 39,567 డాలర్లు, ఎథేరియం 2.88 శాతం ఎగిసి 28727 డాలర్లు, ఎక్స్‌పీఆర్ 0.77 శాతం ఎగిసి 0.759 డాలర్లు, టెర్రా 4.59 శాతం ఎగిసి 77.26 డాలర్లు, సోలానా 1.21 శాతం ఎగిసి 91.49 డాలర్లు, అవాలాంచె 4.01 శాతం ఎగిసి 81.79 డాలర్లు, కార్డానో 1.85 శాతం ఎగిసి 0.9066 డాలర్లు, పోల్కాడాట్ 1.47 శాతం ఎగిసి 18.54 డాలర్లు, స్టెల్లార్ 0.19 శాతం ఎగిసి 0.19 డాలర్లు, డోజీకాయిన్ 1.37 శాతం ఎగిసి 0.127 డాలర్లు, షిబా ఇను 1.64 శాతం ఎగిసి 0.000025 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications