క్రిప్టో కరెన్సీ గతవారం భారీగా పతనమైంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళన నేపథ్యంలో బిట్ కాయిన్ చాన్నాళ్లకు 50,000 డాలర్ల దిగువకు పడిపోయింది. చివరి సెషన్లో స్వల్పంగా పుంజుకున్నప్పటికీ, గతవారం మాత్రం అత్యంత పతనం నమోదు చేసింది. ఒమిక్రాన్ దెబ్బకు శనివారం బిట్ కాయిన్ ఓ సమయంలో గంటలోనే 10,000 డాలర్ల మేర క్షీణించింది. గతవారం ప్రారంభంలో 57,000 డాలర్లకు పైన పలికిన బిట్ కాయిన్ వారంతానికి 49,000 డాలర్లకు వచ్చింది. ఓ సమయంలో 42,000 డాలర్లను కూడా తాకింది. ఆ తర్వాత కాస్త పుంజుకొని, 49,000 డాలర్లకు వచ్చింది. మొత్తానికి గతవారంలో 7000 డాలర్లకు పైగా క్షీణించింది. రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథేరియం 15 శాతం క్షీణించింది. గతవారం ఎథేరియం 3500 డాలర్ల దిగువకు చేరుకుంది ఆ తర్వాత కాస్త కోలుకొని 4,207 డాలర్ల వద్ద ముగిసింది.

అందుకే డౌన్
కొద్దిరోజుల్లోనే 38కి పైగా దేశాల్లో ఒమిక్రాన్ జాడలు కనిపించాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టపోయాయి. భారత్‌లో కూడా ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడటంతో శుక్రవారం మన సూచీలు కూడా నేలచూపులు చూశాయి. మరోవైపు, భారత్ క్రిప్టో కరెన్సీని క్రిప్టో అసెట్‌గా పేరు మార్చి, మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ కిందకు తీసుకురావాలని భావిస్తుండటం కూడా మన వద్ద క్రిప్టో కరెన్సీ సెంటిమెంటు పైన ప్రభావం చూపింది. మరోవైపు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పోవెల్ కఠిన ఆంక్షల వైపు మళ్ళడం కూడా బలహీనతలకు కారణమైంది.

బిట్ కాయిన్ బేర్
అత్యంత ప్రజాదరణ కలిగిన క్రిప్టో కరెన్సీలు బిట్ కాయిన్, ఎథేరియం శనివారం క్షీణించాయి. ఒక దశలో బిట్ కాయిన్ 42,000 డాలర్ల దిగువకు; ఎథేరియం 3,500 డాలర్ల దిగువకు చేరుకుంది. ఈ రెండూ 17 శాతం, 16 శాతం వరకు నష్టపోయాయి. ఆ తర్వాత కాస్త కోలుకున్నాయి. బిట్ కాయిన్ విషయానికి వస్తే శనివారం ఒక గంట వ్యవధిలో 10,000 డాలర్ల మేర నష్టపోయింది. ఆ తర్వాత కోలుకుంది. ఒమిక్రాన్ వేరియంట్ వార్తలు నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు క్రిప్టో కరెన్సీలు కూడా హెచ్చుతగ్గులు నమోదు చేస్తున్నాయి. నవంబర్ 10వ తేదీన బిట్ కాయిన్ 69,000 డాలర్ల వద్ద ఆల్‌టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది. ఆ స్థాయితో 25 శాతానికి పైగా క్షీణించింది. సాధారణంగా ఆల్‌టైం గరిష్ఠాల నుండి 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ పడితే దాన్ని బేర్ మార్కెట్‌గా పరిగణిస్తారు. అంటే బిట్ కాయిన్ మార్కెట్ ఇపుడు బేర్‌లోకి వెళ్లింది. అయితే ఆ తర్వాత కోలుకోవడం గమనార్హం. కార్డానో, సొలానా, పాలీగాన్, షిబాఇను క్రిప్టోలు కూడా 20 శాతం వరకు పడిపోయి, కోలుకున్నాయి.

భారీగా నష్టపోయిన, లాభపడిన క్రిప్టోలు
నిన్నటి సెషన్‌లో భారీగా నష్టపోయిన క్రిప్టోలు ఇలా ఉన్నాయి. అయితే ఆ తర్వాత కాస్త కోలుకున్నాయి. గ్రీన్ ట్రస్ట్ 92.85 శాతం, పెగాగ్జీ 88 శాతం, యిర్ రైజ్ 87.24 శాతం, రైజ్ 86 శాతం, అన్-వాక్స్డ్ 80 శాతం, ఎలాన్ టెక్ 72 శాతం క్షీణించాయి.
అదే సమయంలో చిప్జ్ 387 శాతం, ఆల్ బెస్ట్ ఐకో 229 శాతం, కోగ్స్ స్వాప్ 153 శాతం, యూరో షిబా 117 శాతం, డావ్ కోయిన్ 110 సాతం, ఎన్ టాన్ మో 90 శాతం లాభపడ్డాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications