క్రిప్టో కరెన్సీ మార్కెట్ పరుగు పెడుతోంది. బిట్ కాయిన్, ఎథేరియం సహా వివిధ క్రిప్టోలు జంప్ చేస్తున్నాయి. అయితే గత 2 వారాలుగా బిట్ కాయిన్ కంటే ఎథేరియం పరుగు ఎక్కువగా కనిపిస్తోంది. ఒకటి రెండు చిన్న చిన్న క్రిప్టోలు మినహా మిగతావి ఒక శాతం నుండి మూడు శాతం మేర లాభపడ్డాయి. వరల్డ్ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ 45,000 మార్కు దిశగా కనిపిస్తోంది.
ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 44,633 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత ఇరవై నాలుగు గంటల్లో ఇది 44,176 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 44,933 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 847.30 బిలియన్ డాలర్లు ఎగిసిపడింది. బిట్ కాయిన్ ఆల్ టైమ్ గరిష్టం 68,990.90 డాలర్లు కాగా, కనిష్టం 28,825.76 డాలర్లు.

వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ విషయానికి వస్తే బిట్ కాయిన్ 0.28 శాతం ఎగిసి 44,599 డాలర్లు, ఎథేరియం 0.77 శాతం లాభపడి 3147 డాలర్లు, ఎక్స్‌ఆర్‌పీ 0.40 శాతం ఎగిసి 0.837321 డాలర్లు, టెర్రా 0.73 శాతం ఎగిసి 90.74 డాలర్లు, సోలానా 0.75 శాతం ఎగిసి 101.30 డాలర్లు, కార్డానో 0.64 శాతం ఎగిసి 1.14 డాలర్లు, అవాలాంచె 1.20 శాతం ఎగిసి 85.86 డాలర్లు, పోల్కాడాట్ 1.12 శాతం ఎగిసి 21.05 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి. మీమ్ కాయిన్స్ డోజీకాయిన్ 5.95 శాతం లాభపడి 0.14, షిబా ఇను 0.03 శాతం లాభపడి 0.000025 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications