క్రిప్టో కరెన్సీ ఇటీవల భారీగా పుంజుకుంది. గత ఇరవై నాలుగు గంటల్లోనే వివిధ క్రిప్టోలు పది శాతానికి పైగా లాభపడ్డాయి. క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ 24 గంటల క్రితం సెషన్లో 39,000 డాలర్ల వద్ద ఉంది. కానీ ఈ ఇరవై నాలుగు గంటల్లోనే ఏకంగా దాదాపు 6,000 డాలర్లు లాభపడటం గమనార్హం. రష్యా-ఉక్రెయిన్ చర్చలు, అమెరికా సహా వివిధ దేశాలు రష్యాపై ఆంక్షలు వంటి అంశాలు ప్రభావం చూపాయి. దీంతో క్రిప్టో మార్కెట్ గత కొద్ది గంటల్లోనే పరుగులు పెట్టింది.
అంతర్జాతీయ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ ఈ వార్త రాసే సమయానికి 44,290 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత ఇరవై నాలుగు గంటల్లో గరిష్టం 44,953 డాలర్లు, కనిష్టం 39,209 డాలర్ల వద్ద తాకింది. మార్కెట్ క్యాప్ ఇరవై నాలుగు గంటల్లో 840 బిలియన్ డాలర్లు పెరిగింది. బిట్ కాయిన్ ఆల్ టైమ్ గరిష్టం లేదా 52 వారాల గరిష్టం 68,990.90 డాలర్లు, 52 వారాల కనిష్టం 28,825.76 డాలర్లు.

వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ విషయానికి వస్తే బిట్ కాయిన్ 12.67 శాతం ఎగిసి 44,222 డాలర్ల వద్ద, ఎథేరియం 10.80 శాతం ఎగిసి 3002 డాలర్ల వద్ద, ఎక్స్ఆర్పీ 6.37 శాతం ఎగిసి 0.78 డాలర్ల వద్ద, టెర్రా 18.73 డాలర్లు ఎగిసి 89.95 డాలర్ల వద్ద, సోలానా 7.71 శాతం ఎగిసి 99.57 డాలర్ల వద్ద, అవాలాంచె 13.98 శాతం ఎగిసి 88.44 డాలర్ల వద్ద, కార్డానో 9.49 శాతం ఎగిసి 0.98 డాలర్ల వద్ద, పోల్కాడాట్ 11.08 శాతం ఎగిసి 19.05 డాలర్ల వద్ద, స్టెల్లార్ 7.13 శాతం ఎగిసి 0.198 డాలర్ల వద్ద, డోజీకాయిన్ 8.04 శాతం ఎగిసి 0.135 డాలర్ల వద్ద, పోలీగాన్ 8.14 శాతం ఎగిసి 1.62 డాలర్ల వద్ద, షిబా ఇను 12.49 శాతం ఎగిసి 0.000027 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications