51,000 డాలర్లను క్రాస్ చేసిన బిట్ కాయిన్, బియాన్స్ కాయిన్ 8% జంప్
క్రిప్టో కరెన్సీ క్రమంగా కోలుకుంటోంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్, భారత పార్లమెంటులో క్రిప్టో బిల్లు వంటి వివిధ అంశాల ప్రభావం బిట్ కాయిన్, ఎథేరియం వంటి క్రిప్టోలపై పడింది. బిట్ కాయిన్ గతవారం ఓ సమయంలో 42,000 స్థాయికి పతనమైంది. ఆ తర్వాత క్రమంగా కోలుకుంటోంది. నిన్న 49,000 డాలర్లకు వచ్చిన బిట్ కాయిన్, ఇప్పుడు 51,000 డాలర్లు కూడా దాటింది.
గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ 5 శాతం లాభపడి 2.37 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. అదే సమయంలో మొత్తం క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ 14 శాతం లాభపడి 137.77 బిలియన్ డాలర్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ శీతాకాల పార్లమెంటు సమావేశంలోనే క్రిప్టో బిల్లును తీసుకు వచ్చేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఆర్బీఐ కూడా కొత్త డిజిటల్ కరెన్సీ తీసుకు వచ్చేందుకు సన్నద్ధమవుతుందనే వార్తలు వస్తున్నాయి. ఇది ఇటీవల క్రిప్టో పైన ప్రభావం చూపింది.

వివిధ క్రిప్టో కరెన్సీ ధరలు
వివిధ క్రిప్టో కరెన్సీ ధరలు ఇలా ఉన్నాయి. ఈ వార్త రాసే సమయానికి ధరలు...
బిట్ కాయిన్ 5.14 శాతం లాభపడి 51,513 డాలర్ల వద్ద, ఎథేరియం 6 శాతం ఎగిసి 4,366.62 డాలర్ల వద్ద, సోలానా 3 శాతం వరకు లాభపడి 195.43 డాలర్ల వద్ద, ఎక్స్‌పీఆర్ 5.64 శాతం లాభపడి 0.831092 డాలర్ల వద్ద, టెర్రా 10 శాతం వరకు ఎగిసి 70.69 డాలర్ల వద్ద, కార్డానో 6.5 శాతం ఎగిసి 1.42 డాలర్ల వద్ద, పోల్కాడాట్ 15.33 శాతం ఎగిసి 30.94 డాలర్ల వద్ద, స్టెల్లార్ 6.48 శాతం ఎగిసి 0.288395 డాలర్ల వద్ద, డోజీకాయిన్ 4.50 శాతం లాభపడి 0.179368డాలర్ల వద్ద, షిబా ఇను 5 శాతం ఎగిసి 0.000037 డాలర్ల వద్ద ఉన్నాయి.


Click it and Unblock the Notifications