క్రిప్టో కరెన్సీ నేడు (మార్చి 14) మిశ్రమంగా కదలాడుతోంది. క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ అతి స్వల్పంగా క్షీణించగా, ప్రపంచ రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం అతి స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతోంది. మీమ్ కాయిన్స్ డోజీకాయిన్, షిబా ఇను దాదాపు ఒక శాతం నష్టపోయాయి. ఇటీవల బిట్ కాయిన్ 44,000 డాలర్లు క్రాస్ చేసింది. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో ఇప్పటికీ బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా చూస్తున్నారు. దీంతో యుద్ధం సమయంలో బిట్ కాయిన్ సహా క్రిప్టోలు అన్నీ పతనమయ్యాయి. ఓ సమయంలో 36,000 డాలర్ల దిగువకు పడిపోయింది.
ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం దాదాపు సమసిపోయినట్లుగా భావిస్తున్న నేపథ్యంలో క్రిప్టో కరెన్సీ కాస్త పుంజుకుంటుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రష్యాపై తగ్గినట్లుగా ప్రకటన చేశారు. ఆ సమయంలో క్రిప్టో ఒక్కసారిగా పరుగు పెట్టింది. కానీ చర్చలు కొనసాగుతున్న కారణంగా ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. యుద్ధం పరిణామాలు పూర్తిగా ముగింపు దశకు రాలేదు. కాబట్టి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
బిట్ కాయిన్ ఇప్పటికీ 40,000 డాలర్లకు దిగువనే ఉంది. ఓ సమయంలో ఆల్ టైమ్ గరిష్టం 69,000 డాలర్లు తాకింది. కానీ ద్రవ్యోల్భణ భయాలు, వడ్డీ రేటు పెంపు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో క్రిప్టో ధరలు 30 శాతానికి పైగా పడిపోయాయి. ఇప్పుడు క్రమంగా కోలుకుంటున్నాయి. ఈ వార్త రాసే సమయానికి వివిధ కరెన్సీలు ఇలా ఉన్నాయి.

బిట్ కాయిన్ 0.27 శాతం క్షీణించి 39,009 డాలర్లు, ఎథేరియం 0.32 శాతం లాభపడి 2,590 డాలర్లు, ఎక్స్‌ఆర్‌పీ 3.76 శాతం క్షీణించి 0.7699 డాలర్లు, టెర్రా 4.58 శాతం ఎగిసి 91.31 డాలర్లు, సోలానా 0.68 శాతం నష్టపోయి 81.01 డాలర్లు, అవాలాంచె 3.05 డాలర్లు క్షీణించి 69.55 డాలర్లు, కార్డానో 1.701 శాతం ఎగిసి 0.80 డాలర్లు, డోజీకాయిన్ 1.02 శాతం నష్టపోయి 0.1114 డాలర్లు, షిబా ఇను 2.55 శాతం క్షీణించి 0.000022 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
నేడు భారీగా లాభపడిన క్రిప్టోల్లో జెడ్‌క్యాష్ 5.66 శాతం, కీప్ నెట్ వర్క్ 4.43 శాతం, టెర్రా 4.31 శాతం, ఆర్కిడ్ 2.29 శాతం ఉండగా, ఎక్కువగా నష్టపోయిన క్రిప్టోల్లో స్టోర్జ్ 6.32 శాతం, కైబర్ నెట్ వర్క్ 5.87 శాతం, ఐకాన్ 5.59 శాతం, వేవ్స్ 5.45 శాతం ఉన్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications