బంగారానికి ప్రత్యామ్నాయం అనుకున్నప్పటికీ.. భారీగా పతనమైన బిట్ కాయిన్
ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధం నేపథ్యంలో క్రిప్టో మార్కెట్ కుప్పకూలింది. క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ దాదాపు నవంబర్ నాటి ఆల్ టైమ్ గరిష్టం 69,000 డాలర్లతో పోలిస్తే సగానికి పడిపోయింది. వరల్డ్ రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం కూడా దాదాపు అంతే శాతం పతనమైంది. ఈ వార్త రాసే సమయానికి (మధ్యాహ్నం గం.3.15) బిట్ కాయిన్ 35,502 డాలర్లకు పడిపోయింది. గత ఇరవై నాలుగు గంటల్లో 34,338 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 39,250 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ ఇరవై నాలుగు గంటల్లో 670 బిలియన్ డాలర్లు క్షీణించింది. బిట్ కాయిన్ ఆల్ టైమ్ లేదా 52 వారాల గరిష్టం 68,990.90 డాలర్లు కాగా, కనిష్టం 28,825.76 డాలర్లు.
క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ విషయానికి వస్తే బిట్ కాయిన్ 8.68 శాతం క్షీణించి 35,429 డాలర్లు, ఎథేరియం 12.28 శాతం క్షీణించి 2379 డాలర్లు, ఎక్స్‌ఆర్‌పీ 13 శాతం క్షీణించి 0.640 డాలర్లు, సోలానా 9.37 శాతం క్షీణించి 81.51 డాలర్లు, టెర్రా 7.76 శాతం క్షీణించి 52.45 డాలర్లు, అవాలాంచె 14.63 శాతం క్షీణించి 67.32 డాలర్లు, కార్డానో 16.63 శాతం క్షీణించి 0.771 డాలర్లు, స్టెల్లార్ 12.90 శాతం క్షీణించి 0.167 డాలర్ల, పోల్కాడాట్ 16.57 శాతం క్షీణించి 14.26 డాలర్లు, డోజీకాయిన్ 16.18 శాతం క్షీణించి 0.112241 డాలర్లు, షిబా ఇను 17.10 శాతం క్షీణించి 0.000022 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బిట్ కాయిన్ ట్రేడింగ్ వ్యాల్యూమ్ 14 నెలల కనిష్టం డిసెంబర్ 2020 నాటికి పడిపోయింది. బిట్ కాయిన్ డెయిలీ వ్యాల్యూమ్ ఫిబ్రవరి 19వ తేదీన 1.7 బిలియన్ డాలర్లుగా ఉంది. డిసెంబర్ 7 తర్వాత ఇదే కనిష్టం. కాగా, అంతర్జాతీయ సంక్షోభ సమయాల్లో ఇప్పటికీ బంగారానిదే పైచేయిగా ఉంది. ఇటీవలి వరకు బిట్ కాయిన్, ఇతర క్రిప్టోలు పరుగు పెట్టడంతో బంగారానికి ప్రత్యామ్నాయంగా అభిప్రాయపడ్డారు. కానీ ప్రస్తుత రష్యా-ఉక్రెయిన్ సంక్షోభ సమయంలో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. దీంతో పసిడి పరుగు పెడుతోంది. బంగారం తర్వాత వెండి కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. కానీ బిట్ కాయిన్, ఇతర క్రిప్టోలు పతనమవుతున్నాయి.


Click it and Unblock the Notifications