Crypto Price: నష్టాల్లో బిట్ కాయిన్, ఎగిసిపడిన ఎథేరియం
టాప్ క్రిప్టో కరెన్సీలు నేడు దాదాపు స్థిరంగా ఉన్నాయి. వరల్డ్ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ నష్టాల్లో ఉండగా, రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం స్వల్పంగా లాభపడింది. ఇతర క్రిప్టో కరెన్సీలు ఎక్కువగా నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. బిట్ కాయిన్ నేడు 40,000 డాలర్లకు పైన ట్రేడ్ అవుతోంది. ఈ వరల్డ్ అతిపెద్ద క్రిప్టో ఈ వార్త రాసే సమయానికి 40,620.23 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. గత ఇరవై నాలుగు గంటల్లో కనిష్టం 40,180 డాలర్లు, గరిష్టం 41,058 డాలర్లు. మార్కెట్ క్యాపిటలైజేషన్ 771.22 బిలియన్ డాలర్లు క్షీణించింది. 52 వారాల గరిష్టం 68,990 డాలర్లు, కనిష్టం 28,825 డాలర్లు.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో వేవ్స్ 5.86 శాతం, ఏవ్ 5.26 శాతం, కుసామా 5.20 శాతం, ఓఎంజీ నెట్ వర్క్ 3.36 శాతం, సింథెటిక్స్ 3.23 శాతం, కైబర్ నెట్ వర్క్ 3.05 శాతం, లైవ్ పీర్ 2.89 శాతం లాభపడ్డాయి. నష్టపోయిన వాటిలో టెర్రా ముందు ఉంది. ఇది దాదాపు 5 శాతం, బేసిక్ అటెన్షన్, రెన్ కూడా దాదాపు 4.5 శాతానికి పైగా క్షీణించాయి. స్కేల్ 4.14 శాతం, జెడ్ క్యాష్ 3.86 శాతం, నానో 3.83 శాతం నష్టపోయాయి. సోలానా, షిబా ఇను కూడా మూడు శాతం మేర క్షీణించాయి.

మార్కెట్ క్యాప్ పరంగా టాప్ 10 క్రిప్టోల విషయానికి వస్తే బిట్ కాయిన్ 0.77 శాతం క్షీణించి 40,595 డాలర్లు, ఎక్స్‌ఆర్‌పీ 1.20 శాతం క్షీణించి 0.780255 డాలర్లు, టెర్రా 4.99 శాతం క్షీణించి 83.69 డాలర్లు, సోలానా 3.41 శాతం క్షీణించి 86.66 డాలర్లు, అవాలాంచె 2.12 శాతం క్షీణించి 78.86 డాలర్లు, కార్డానో 1.15 శాతం క్షీణించి 0.83 డాలర్లు, పోల్కాడాట్ 2.85 శాతం క్షీణించి 18.38 డాలర్లు, స్టెల్లార్ 0.31 శాతం క్షీణించి 0.18 డాలర్లు, డోజీకాయిన్ 1.60 శాతం క్షీణించి 0.11 డాలర్లు, షిబా ఇను 2.92 శాతం క్షీణించి 0.000022 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి. ఎథేరియం మాత్రమే దాదాపు రెండు శాతం ఎగిసి 2862 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications