నిన్న ఉద్యోగాల కోత.. కట్ చేస్తే ఇప్పుడు బిస్కట్లకు టైమ్ వచ్చింది!
గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా ఆర్థిక మందగమనం నెలకొంది. ఇప్పుడు కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మార్కెట్లు దెబ్బతిన్నాయి. ఉత్పత్తులు పడిపోయాయి. దీంతో వివిధ దేశాల్లో నిత్యావసర వస్తువులకు డిమాండ్ పెరుగుతోంది. భారత్‌లోను కరోనా ప్రభావం ఎక్కువే ఉంది. ముందు జాగ్రత్తగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నాయి. నిత్యావసరాలకు మాత్రం డిమాండ్ ఉంది.

నాడు భారీగా పడిపోయిన సేల్స్
2019 ఆగస్ట్ నెలలో పార్లే-జీ ఆర్థిక మందగమనం నేపథ్యంలో 10,000 మంది ఉద్యోగులను తొలగించే పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అప్పుడు బిస్కట్ ఉత్పత్తులు భారీగా పడిపోయాయి. బ్రిటానియా కూడా ఉద్యోగులను తొలగిస్తుందని నాడు వార్తలు వచ్చాయి. మందగమనం సమయంలో బిస్కట్ సేల్స్ భారీగా పడిపోయాయి.

ఇప్పుడు రివర్స్.. పెరిగిన బిస్కట్ సేల్స్
ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు బిస్కట్ సేల్స్ భారీగా పెరిగాయి. రెండు వారాల క్రితం పార్లే-జీ బిస్కట్ సేల్స్ 10 శాతం నుండి 15 శాతం పెరిగాయట. గత వారం ఏకంగా 25 శాతం పెరిగాయట. అంటే మార్చి నెలలోనే బిస్కట్ సేల్స్ పెరుగుతున్నాయి.

25 శాతం వరకు పెరుగుదల
ఇండియాలో అత్యంత పాపులర్ బ్రాండ్‌లలో పార్లేజీ ఒకటి. డిస్ట్రిబ్యూటర్స్, స్టోర్స్, ఈ కామర్స్ ఛానల్స్ వద్ద పెద్ద ఎత్తున స్టాక్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు బిస్కట్ ర్యాక్‌లు ఖాళీ అవుతున్నాయట. ఎందుకంటే గతంలో కంటే సేల్స్ ఏకంగా 25 శాతం పెరగడమే ఇందుకు కారణం.

బిస్కట్లకు టైమ్ వచ్చింది..!
ఆర్థిక మందగమనం నేపథ్యంలో గత క్యాలెండర్ ఏడాదిలో సేల్స్ భారీగా తగ్గాయని, వినియోగదారులు కనీసం రూ.5 బిస్కట్ కూడా కొనుగోలు చేయలేని పరిస్థితులు అని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు బిస్కట్ ర్యాక్‌లు ఖాళీ అవుతున్నాయట. ఇప్పుడు బిస్కట్లకు టైమ్ వచ్చింది అని చమత్కరిస్తున్నారు.


Click it and Unblock the Notifications