For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సొంతగా కరోనా ఔషధం తయారు చేసిన హైదరాబాద్ సంస్థ, ఎగుమతులకు ఓకే

|

ప్రాథమిక దశ నుండి మధ్యస్థాయి కరోనా చికిత్సలో వినియోగిస్తున్న ఫెవిపిరవిర్ ఔషధాన్ని హైదరాబాద్‌కు చెందిన బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ తయారు చేసింది. ఫెవిపిరవిర్ ఔషధాన్ని పూర్తిగా సొంత పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినట్లు, ఈ ఔషధం ఫెవిపిరవిర్ ఏపీఐని ఇతర దేశాలకు ఇప్పటికే ఎగుమతి చేయడం ప్రారంభించినట్లు బయోఫోర్ సీఈవో డాక్టర్ జగదీశ్ బాబు తెలిపారు.

గ్లెన్‌మార్క్ శుభవార్త, కరోనా ఫాబిఫ్లూ 27% తగ్గింపు: ఏ దేశంలో ఎంత ధర?గ్లెన్‌మార్క్ శుభవార్త, కరోనా ఫాబిఫ్లూ 27% తగ్గింపు: ఏ దేశంలో ఎంత ధర?

ఈ టాబ్లెట్స్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయడానికి వీలుగా డీసీజీఐ (డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) వద్ద దరఖాస్తు చేసినట్లు తెలిపింది. అనుమతులు కూడా వచ్చాయి. దీంతో ఫెవిపిరవిర్ ఏపీఐని తయారు చేసి, ఎగుమతులు చేసుకోవచ్చు. స్థానిక భాగస్వామితో కలిసి ఎగుమతి చేసేందుకు టర్కీ నుండి కూడా అనుమతులు వచ్చాయి.

Biophore gets DCGI nod to make and export Favipiravir API

ఈ కంపెనీ ఉత్పత్తిని మార్కెట్ చేసేందుకు భారత్‌‌లోని భాగస్వాములతో చర్చలు జరుపుతోంది. బంగ్లాదేశ్, ఈజిప్ట్ దేశాలకు చెందిన కంపెనీలతో ఎగుమతుల అంశంపై చర్చలు జరుపుతోంది. తమ ఉత్పాదక సదుపాయాలు అమెరికా, ఈయూ నిబంధనలకు కూడా లోబడి ఉంటాయని తెలిపింది.

మన దేశంలో ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను విక్రయించేందుకు గ్లెన్‌మార్క్ ఫార్మాకు అనుమతి లభించింది. ఒక్కో ట్యాబ్లెట్ రూ.103 ధర ఉండగా దానిని రెండు రోజుల క్రితం రూ.75కు తగ్గించింది. దేశీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అందుబాటు ధరలో ఫావిపిరవిర్ ట్యాబ్స్ విడుదల చేయాలని తాము భావిస్తున్నట్లు తెలిపింది.దీనిని ఇంటర్మీడియేట్ స్టేజ్ నుంచి ఏపీఐ వరకు హైదరాబాద్ సమీపంలోని తమ ఫార్ములేషన్ ప్లాంటులో సొంతగా తయారు చేస్తున్నట్లు తెలిపింది.

English summary

సొంతగా కరోనా ఔషధం తయారు చేసిన హైదరాబాద్ సంస్థ, ఎగుమతులకు ఓకే | Biophore gets DCGI nod to make and export Favipiravir API

Biophore India Pharmaceuticals has received Drugs Controller General of India licence to manufacture and export Favipiravir, the active pharmaceutical ingredient (API) of an antiviral drug approved by DCGI for use in the treatment of mild to moderate COVID-19 cases.
Story first published: Wednesday, July 15, 2020, 10:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X