Elon Musk: చాలా కాలంగా ప్రపంచ కుబేరుల జాబితాలో మెుదటి స్థానంలో కొనసాగుతున్న ఎలాన్ మస్క్ కొత్త పనులు చేయటంలో దిట్ట. సరైన స్కిల్ ఉంటే చాలు ఎలాంటి వాడైనా జీవితంలో ఎదగగలడు అని పెద్దవాళ్లు చెప్పిన మాటలు జీవితంలో చాలాసార్లే విని ఉంటాం. మస్క్ మామ చేసే పనులు చూస్తుంటే అలాంటివి నిజమేననే అభిప్రాయం కలుగుతుంటుంది.
ఎలాన్ మస్క్ సంచలన ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. కష్టపడి పనిచేసే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయి సూపర్ యాప్ నిర్మించాలనే కోరిక కలిగి ఉన్నట్లయితే తమతో జతకట్టొచ్చని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ఇందుకోసం [email protected]కి మెయిల్ పంపవచ్చని పేర్కొన్నాడు. పైగా పనిచేయటానికి ముందుకొచ్చే వ్యక్తి అసలు స్కూలుకు వెళ్లాడా లేదా పెద్ద కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉందా లేదా అనే అంశాలు తనకు అక్కర్లేదని, కేవలం తమ కోడింగ్ స్కిల్ చూపిస్తే జాబ్ పక్కా అంటూ తేల్చి చెప్పాడు. దీంతో మరోసారి మస్క్ కార్పొరేట్ కల్చర్‌ని పక్కన పెట్టి పనిచేసేవారి కోసం వేట మెుదలెట్టారని తెలుస్తోంది.

అయితే ఎలాన్ మస్క్ ఇలాంటి పనులు చేయటం ఇదే తొలిసారి కాదనే విషయం మనందరికీ తెలిసిందే. 2014లో టెస్లాలో పనిచేయటానికి విద్యార్హత అవసరం లేదంటూ మస్క్ మామ ఇలాంటి ప్రకటనే చేసిన సంగతి తెలిసిందే. స్సేస్ ఎక్స్ లో కూడా ఇలాంటి ధోరణిని మస్క్ చూపిన సంగతి తెలిసిందే. అయితే ఇదే తరహా నియమకాలను తాను కొనుగోలు చేసిన ఎక్స్ లోనూ ప్రవేశపెట్టాలని చూస్తున్నట్లు తాజా పరిణామాల నుంచి అర్థం అవుతోంది.
ప్రస్తుతం మస్క్ వైఖరికి మద్దతుదారులతో పాటు విమర్శకులు కూడా ఉన్నారు. సాంప్రదాయేతర నేపథ్యాల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన వ్యక్తులకు వేదికగా దీనిని కొంతమంది పెద్ద అవకాశంగా చూస్తుండగా.. మరికొందరు ఈ పద్దతిని అవలంభించటం పెద్ద స్థాయిలో అవలంభించటానికి కుదరదని అంటున్నారు. అయితే మస్క్ మాత్రం తాను కోరుకున్న రిజల్స్ట్ కోసం కొత్త మార్గాలను అందిపుచ్చుకోవటం ముందు నుంచి చేస్తూనే ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే.
మస్క్ కంపెనీ ఎక్స్ ఇప్పటికే తన పరివర్తన కోసం అవసరమైన పునాదిని వేసుకుంది. ఈ ప్లాట్‌ఫామ్ 2025 నాటికి అనేక ఫీచర్లను విడుదల చేయాలని చూస్తోంది. వాటిలో చెల్లింపు సేవ అయిన X మనీ, మల్టీమీడియా కంటెంట్ కోసం స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన X TV ఉండటం గమనార్హం. 2024 చివరలో ప్రారంభించబడిన AI చాట్‌బాట్ గ్రోక్ కూడా గణనీయమైన అప్‌గ్రేడ్‌లను అందుకుంటోంది. అసాధ్యం అనుకునే ఫీచర్లు, సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications