ఢిల్లీ: ఇన్నాళ్లూ చౌక ధరకే వాయిస్ కాల్స్, డేటా ఎంజాయ్ చేసిన కస్టమర్లకు రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ షాకిచ్చాయి. జియో ఆరో తేది నుంచి, మిగతా రెండు కంపెనీలు 3వ తేదీ నుంచి టారిఫ్ పెంచుతున్నట్లు ప్రకటించాయి. టెలికం ఇండస్ట్రీలో దాదాపు అతిపెద్ద పెంపుగా భావిస్తున్నారు. కంపెనీలు ఏకంగా 40 శాతానికి పైగా టారిఫ్ పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ ఛార్జీలు ఇలా ఉండనున్నాయి...
వినియోగదారులకు టెలికం కంపెనీల షాక్: పెంచిన ఛార్జీలు ఇలా...

50 శాతం వరకు పెంపు
ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లపై 50% వరకు చార్జీలను పెంచింది. డిసెంబర్ 3వ తేదీ నుంచి ఇది అమలులోకి వస్తోంది. వొడాఫోన్ ఐడియా చార్జీల పెంపు ప్రకటన కొద్ది గంటలకే ఎయిర్‌టెల్ కూడా పెంపు నిర్ణయాన్ని తెలిపింది. సంవత్సర కాలపరిమితికి సంబంధించిన రూ.998 ప్లాన్ ధరను రూ.1,499గా నిర్ణయించింది. ఇది 50 శాతం పెరిగింది. డాటా వినియోగ పరిమితిని 12GB నుంచి 24GBకి పెంచింది.

రూ.1699 ప్లాన్ రూ.2398
ప్రస్తుతం రూ.1,699గా ఉన్న 365 రోజుల ప్లాన్ ధరను 41.2 శాతం పెంచింది. దీంతో ఇది రూ.2,398కి పెరగనుంది. రోజుకు డాటా వినియోగ పరిమితి 1.5GB. 84 రోజుల కాలపరిమితితో రోజుకు 1.5GB డాటాతో ఉన్న ప్లాన్‌ను రూ.458 నుంచి రూ.598కి పెంచింది. రూ.199 ప్లాన్ ధరను కూడా సుమారు 25% పెంచింది. దీంతో ఇది రూ.248కి పెరిగింది.

50 శాతం పెరిగింది.. ఉచిత కాల్స్ ఇవే
ప్రస్తుత స్కీంల ఛార్జీల పెంపు రోజుకు 50 పైసల నుంచి రూ.2.85 వరకు పెరిగింది. అపరిమిత వినియోగ స్కీం అయినా 28 రోజుల కాలపరిమితికి 1,000 నిమిషాలు, 84 రోజులకు 3,000 నిమిషాలు, 365 రోజులకు 12,000 నిమిషాల మేర ఇతర నెట్ వర్క్స్‌కు ఉచిత కాల్ చేసుకోవచ్చు. ఇంతకుమించితే మాత్రం 6 పైసల చొప్పున చెల్లించాలి.

మినిమం రీచార్జ్ రూ.49కి పెంపు
ఎయిర్‌టెల్ పాపులర్ బండిల్డ్ ప్లాన్స్ రూ.249 (28 రోజులు), రూ.448 (82 రోజులు) ఇప్పుడు వరుసగా రూ.298 (28 రోజులు), రూ.598 (84 రోజులు) అయ్యాయి. అలాగే, మినిమం రీచార్జ్‌ని రూ.35 నుంచి రూ.49కి పెంచింది.


Click it and Unblock the Notifications