దేశంలో అక్షయ తృతీయ పండుగకు ముందు పసిడి ప్రియులకు ఊహించని షాక్ తగిలింది. మరో వారం రోజుల్లో అక్షయ తృతీయ సందడి ప్రారంభం కానుండగా బంగారం ధరలు ఆల్ టైం హై కి చేరుకుని, రికార్డును సృష్టించాయి.సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇప్పటికే బంగారాన్ని కొనుగోలు చేయలేమని పెరుగుతున్న ధరలను చూసి నిరాశ నిస్పృహలతో ఉంటే, వారిలో మరింత ఆందోళనను పెంచుతూ బంగారం ధర మళ్ళీ పెరిగింది.
నాగార్జునసాగర్ నీటిని విడుదల చెయ్యాలని తెలంగాణాను ఆదేశించండి: కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ!!
ఇక ఈరోజు దేశీయంగా ఏకంగా బంగారం ధర 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 550 రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి 600 రూపాయలు మేర ధర పెరిగింది. ఈరోజు హైదరాబాద్లో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,650 గా ప్రస్తుతం కొనసాగుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,800గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,800 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,950 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,650 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,800 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది.
బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,700గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,850 రూపాయలుగా ప్రస్తుతం విక్రయించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కడప, కర్నూలు, ప్రకాశం, తిరుపతి, కాకినాడ, రాజమండ్రిలో 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 56,650 గా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,800గా ప్రస్తుతం కొనసాగుతుంది.

దేశంలోనే బంగారం ధరలలో అత్యధిక ధరలు ఉండే తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, మధురై, కోయంబత్తూరు, సేలం, ఈరోడ్, తిరుపూర్, తిరుచ్చి, తిరునవ్వేలీలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 57, 300 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 62,500గా ప్రస్తుతం విక్రయించబడుతుంది.


Click it and Unblock the Notifications