బ్రిటన్ ప్రధాని "కియర్ స్టార్మర్" గురువారం భారత ఫిన్‌టెక్ మరియు టెక్ కంపెనీలను బ్రిటన్‌లో వ్యాపారం చేయమని ఆహ్వానిస్తూ, భారత కంపెనీలకు మేము ఎర్ర తివాచీ పరుస్తున్నాం అని ప్రకటించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం, వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారతదేశంతో బలమైన భాగస్వామ్యం కోసం మేము కట్టుబడి ఉన్నాం," అని ఆయన పేర్కొన్నారు.
ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్లో ఆయన మాట్లాడారు. ప్రధాని అయిన తర్వాత ఆయన తీసుకువచ్చిన ఇది మొదటి వ్యాపార బృందం. గత 10 ఏళ్లలోనే కాకుండా, భారత్‌కి వచ్చిన ఇది ఇప్పటివరకు అతిపెద్ద బ్రిటన్ వ్యాపార బృందం. స్టార్మర్ తన ప్రసంగాన్ని హిందీలో ప్రారంభించి, "ముఝే యహాన్ ఆకర్ బహుత్ ఖుషీ హుయీ (ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది) అని అన్నారు.

"మీరు గొప్ప ఉద్యోగాలు, అభివృద్ధి, విజయాలు సాధించాలనుకుంటే, మేము ఎర్రతివాచీ పరుస్తున్నాం. యుకేలో భారత ప్రముఖ సంస్థలు విస్తరించి, ప్రపంచ మార్కెట్‌లో అడుగుపెట్టాలి. అదే సమయంలో బ్రిటన్ కంపెనీలు భారత్‌లో విజయవంతం కావాలి," అని ఆయన స్పష్టం చేశారు. "ప్రధాని మోడీతో కలిసి మేము నిర్మిస్తున్న సంబంధం ఆధునికమైనదిగా, డైనమిక్‌గా ఉంటుంది. ఇది గొప్ప లక్ష్యాలతో కూడిన భాగస్వామ్యం. మేము కలిసి గొప్ప విషయాలు సాధించగలమని తెలుసు," అని స్టార్మర్ అన్నారు. అలాగే, "ఈ సంబంధంలో పెట్టుబడి పెట్టే సమయం వచ్చేసింది. ఇది యుకే-ఇండియా భాగస్వామ్యంలో కొత్త యుగానికి నాంది అవుతుంది. ఎన్నో సంవత్సరాలు సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరుస్తుంది," అని పేర్కొన్నారు.
స్టార్మర్ మాట్లాడుతూ, "ఫిన్‌టెక్ మరియు ఇన్నోవేషన్ కోసం యుకేను మరింత ఆకర్షణీయంగా మార్చుతున్నాం. డిజిటల్ మౌలిక సదుపాయాలు, డేటా షేరింగ్, AI వినియోగంపై పెట్టుబడి పెడుతున్నాం. అంతేకాదు, ఫాస్ట్-ట్రాక్ అనుమతులు, సులభతర కాంప్లయన్స్, సడలింపులతో అత్యుత్తమ గ్లోబల్ టాలెంట్‌ను ఆకర్షిస్తున్నాం. అంతర్జాతీయ సంస్థల కోసం ప్రత్యేకంగా "ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీస్ని ఏర్పాటు చేస్తున్నాం. యుకే నిజంగానే ఈ అవకాశాలకు కట్టుబడి ఉందని చూపించడానికి మేము భారత్‌కి వచ్చాము" అన్నారు.
ఇందుకు ముందు మోడీ, స్టార్మర్ ఇద్దరూ CEO ఫోరంలో పాల్గొని పరిశ్రమ నాయకులతో చర్చించారు. గత మూడు నెలల్లో యుకే-ఇండియా మధ్య వాణిజ్య, పెట్టుబడులు "6 బిలియన్ పౌండ్లు" పెరిగాయి అని స్టార్మర్ తెలిపారు. అలాగే, "గత బ్రిటన్ ప్రభుత్వాలు ఒప్పందాలు కుదుర్చుకొని, తర్వాత దానిపై ఫాలో-అప్ చేయకుండా వదిలేవి. కానీ ఇప్పుడు మేము భిన్నంగా పని చేస్తాం. ప్రభుత్వమే సహకారం, మద్దతు అందిస్తూ ఈ ఒప్పందం వాస్తవ ప్రయోజనం ఇస్తుందని చూసుకుంటుంది" అని స్పష్టం చేశారు.
ప్రెస్ బ్రీఫింగ్‌లో స్టార్మర్ "ఇజ్రాయెల్-గాజా శాంతి ప్రణాళికకు" స్వాగతం పలికారు. "ఇది బందీలకు, వారి కుటుంబాలకు, గాజాలోని ప్రజలకు ఊరట కలిగిస్తుంది," అన్నారు. ఈ ఒప్పందం ప్రెసిడెంట్ ట్రంప్ నేతృత్వం వల్లే సాధ్యమైందని కూడా ఆయన గుర్తు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, "భారతదేశం రష్యా చమురు కొనుగోలు ఆపాలని మేము చర్చించాము. ఈ యుద్ధం ముగియాలని మేము కోరుకుంటున్నాము. ఇందుకోసం శాడో ఫ్లీట్, కోలీషన్ ఆఫ్ ది విల్లింగ్ వంటి అంశాల పై చర్చించాము" అని స్టార్మర్ తెలిపారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications