ITR Filing Alert: జూలై 31న టాక్స్ ఫైలింగ్ మిస్ అయ్యారా భారీ నష్టం తప్పదు..! పూర్తి వివరాలివే

Tax Return Filing: 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు జూలై 31 చివరి తేదీ. గడువు సమయంలోపు ఫైలింగ్ ప్రక్రియ పూర్తి చేయకపోతే మూడు నష్టాలు కలగనున్నాయి. చాలా మంది చివరి క్షణం వరకు ఆలస్యం చేసి తర్వాత గడువు పొడిగించలేదని షాక్ అవుతుంటారు.

1. పన్ను చెల్లింపుదారులు జూలై 31 గడువు సమయానికి రిటర్న్ ఫైలింగ్ పూర్తి చేయటంలో విఫలమైతే పాత పన్ను విధానంలో తేదీ తర్వాత.. ఓల్డ్ టాక్స్ రీజిమ్ కింద రిటర్న్‌ను ఫైల్ చేయలేరు. ఎందుకంటే 2023-24 ఆర్థిక సంవత్సరానికి కొత్త పన్ను విధానం డిఫాల్ట్ ఎంపికగా ఉండటమే దీనికి కారణం. అంటే ఈ లెక్కన ఆర్థిక సంవత్సరం పూర్తయ్యాక పన్ను రిటర్న్ ఫైల్ చేసే వ్యక్తులు తప్పనిసరిగా కొత్త టాక్స్ రీజిమ్ కింద ఐటీఆర్ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

Big Alert Late ITR filing leads to 3 major loses to Tax filers know impacts

ఇదే జరిగితే వారు తమ మినహాయింపులను, పన్ను తగ్గింపులను పొందలేరని గుర్తుంచుకోవాలి. ఇక్కడ వారు ఈ ప్రయోజనాలు లేని కొత్త పన్ను విధానంలోకి మార్చబడతారు. అందువల్ల వ్యాపార ఆదాయం లేని జీతం పొందే పన్ను చెల్లింపుదారులు , పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారు గడువు తేదీకి ముందే ITRని ఫైల్ చేయాలని దిల్లీకి చెందిన సంస్థ PD గుప్తా & కంపెనీ భాగస్వామి చార్టర్డ్ అకౌంటెంట్ ప్రతిభా గోయల్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

2. ఇక టాక్స్ పేయర్స్ తమ ఐటీఆర్ గడువు తర్వాత ఫైల్ చేయటం వల్ల కలిగే రెండో నష్టం పెనాల్టీ. జూలై 31 డెడ్‌లైన్ మిస్ అయినందున ఆదాయపు పన్ను శాఖ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234F కింద రూ.5,000 ఆలస్యమైన ఫైలింగ్ రుసుమును విధించబడతారు. ఇదే క్రమంలో సదరు వ్యక్తి వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉన్నట్లయితే లేటు ఫైలింగ్ రుసుము రూ.1,000కి తగ్గించబడింది. ఈ క్రమంలో లేటుగా ఫైల్ చేసిన ఐటీఆర్ ప్రకారం ఏదైనా పన్ను చెల్లించాల్సి ఉన్నట్లయితే గడువు తేదీ నుంచి బకాయి ఉన్న పన్ను మొత్తంపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234A ప్రకారం నెలకు 1 శాతం చొప్పున వడ్డీ వసూలు చేయబడుతుంది.

3. ఇక లేటు ఐటీఆర్ ఫైలింగ్ కారణంగా కలిగే అతిపెద్ద నష్టం వారు ఓల్డ్ టాక్స్ రీజిమ్ కింద మిస్ కావటం వల్ల కలుగుతుంది. ఈ క్రమంలో టాక్స్ పేయర్స్ తమ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ప్రాపర్టీలు లేదా వారి వ్యాపారంలో ఏదైనా పెట్టుబడి పెట్టడం వల్ల కలిగిన క్లెయిమ్ చేసుకునేందుకు తర్వాతి సంవత్సరాలకు క్యారీ ఫార్వర్డ్ చేయలేరు. తర్వాతి సంవత్సరాల్లో వచ్చిన లాభాలను ప్రస్తుత నష్టాలకు వ్యతిరేకంగా సెటాఫ్ చెసుకునేందుకు ఉన్న అవకాశాన్ని లేటుగా పన్ను రిటర్స్ దరఖాస్తు చేయటం వల్ల కోల్పోవాల్సి ఉంటుందని, నష్టాలను కొనసాగించడానికి మీరు అనుమతించబడరని చార్టర్డ్ అకౌంటెంట్ చౌహాన్ పేర్కొన్నారు.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns Telugu. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+