మొబైల్ సర్వీసులు అందించే ప్రముఖ కంపెనీ ఎయిర్టెల్ త్వరలోనే విదేశీ సంస్థ కాబోతోంది. దేశంలోనే మొట్ట మొదటి మొబైల్ ఫోన్ సేవల సంస్థ ఐన ఎయిర్టెల్ ... ఎన్ని విదేశీ కంపెనీలు వచ్చినా పోటీని ఎదుర్కొని నెంబర్ 1 స్థానంలో కొనసాగింది. సునీల్ భారతి మిట్టల్ స్థాపించిన ఈ కంపెనీ దశాబ్దాలుగా దేశ పౌరుల మన్ననలు అందుకోంది. కానీ ఇటీవల మార్కెట్ రంగ ప్రవేశం చేసిన ముకేశ్ అంబానీ కి చెందిన రిలయన్స్ జియో తో తన మార్కెట్ లీడర్షిప్ స్థానాన్ని కోల్పోయింది.
చరిత్రలో తోలి సారి నష్టాలను చవిచూసింది. రుణాల ఊబిలో కూరుకు పోయింది. అదే సమయంలో ప్రభుత్వానికి సుమారు రూ 43,000 కోట్ల మేరకు ఏజీఆర్ బకాయి పడింది. ఇందుకోసం మరో సారి రుణాలు లేదా పెట్టుబడి సమీకరించక తప్పసనిసరి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఎయిర్టెల్ మాతృ సంస్థ ఐన భారతి టెలికాం విదేశి పెట్టుబడిని సమీకరిస్తోంది. సింగపూర్ కు చెందిన సింగ్ టెల్ అనే కంపెనీ ని నుంచి ఈ పెట్టుబడిని సేకరిస్తోంది. దీంతో ఎయిర్టెల్ పేరెంట్ కంపెనీ లో విదేశి పెట్టుబడిదారుల వాటా పెరుగుతుండటంతో ఎయిర్టెల్ ఇకపై విదేశి సంస్థగా ఆవిర్భవించనుంది.

రూ 4,900 కోట్లు...
నిధుల సమీకరణలో భాగంగా భారతి టెలికాం పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను సమీకరిస్తోంది. ఇందులో భాగంగా సింగపూర్ కు చెందిన సింగ్ టెల్ అనే కంపెనీ సహా మరికొన్ని విదేశీ సంస్థల ద్వారా సుమారు రూ 4,900 కోట్ల పెట్టుబడిని సేకరిస్తోంది. ఈ మేరకు భారతి టెలికాం ప్రభుత్వానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోంది. దీంతో భారతి టెలికాం లో విదేశీ కంపెనీల వాటా 50% కంటే ఎక్కువకు చేరుకుంటుంది. అప్పుడు సహజంగానే అదే విదేశీ కంపెనీగా ఆవిర్భవిస్తుంది. భారతి టెలికాం సుమారు రూ 4,900 కోట్ల విదేశి పెట్టుబడుల కోసం ప్రభుత్వ అనుమతి కోరుతోంది. త్వరలోనే ఇందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం (డాట్) అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అది జరిగితే కంపెనీ విదేశి కంపెనీగా మారిపోతుంది అని ఒక ఉన్నతాధికారి తెలిపారు. ఈ విషయాన్నీ ప్రముఖ వార్తా సంస్థ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఒక కథనంలో వెల్లడించింది.

సునీల్ మిట్టల్ కు 52% వాటా...
ప్రస్తుతం భారతి ఎయిర్టెల్ కు పేరెంట్ కంపెనీ ఐన భారతి టెలికాం లో దాని వ్యవస్థాపకుడు సునీల్ భారతి మిట్టల్ తో పాటు అయన కుటుంబ సభ్యులకు 52% వాటా ఉంది. అయితే ప్రస్తుత నిధుల కోసం సునీల్ మిట్టల్ ఎంత మేరకు తమ వాటాను తగ్గించుకొంటారో వెల్లడి కానప్పటికీ ఈ వాటా కచ్చితంగా వారి షేర్ హోల్డింగ్ ను 50% కంటే తక్కువకు పడిపోయేలా చేస్తుందని చెప్పటం లో సందేహం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో సహజంగానే ఎయిర్టెల్ మాతృ సంస్థ లో విదేశి పెట్టుబడిదారుల వాటా 50% కంటే పెరిగితే అది ఎయిర్టెల్ లో నూ ప్రతిబింబిస్తుంది. అందుకే ఎయిర్టెల్ కూడా విదేశి కంపెనీ అయిపోతుందని వివరణ ఇచ్చారు.

ఎయిర్టెల్ లో విదేశి వాటా 84%...
భారతి ఎయిర్టెల్ లో ప్రస్తుతం విదేశీ సంస్థల వాటా 43% గా ఉంది. సింగ్ టెల్ సహా విదేశీ కంపెనీలు అందించే రూ 4,900 కోట్ల పెట్టుబడితో భారతి టెలికాంలో వారి వాటా పెరిపోయి అది తొలుత విదేశీ సంస్థగా మారిపోతుంది. తద్వారా భారతి ఎయిర్టెల్ లో ఫారిన్ షేర్ హోల్డింగ్ 84% నికి పెరిగిపోతుంది. దీంతో ఎయిర్టెల్ ఒక విదేశి కంపెనీగా ఆవిర్భవిస్తుందని పీటీఐ తన కథనంలో పేర్కొంది. టెలికాం రంగంలో భారత ప్రభుత్వం 100% విదేశీ పెట్టుబడులను అనుమతిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎయిర్టెల్ కూడా 100% విదేశీ పెట్టుబడి కోసం ప్రభుత్వ అనుమతి కోరుతోంది.

రూ 21,000 కోట్ల సమీకరణ..
రుణాల ఒత్తిడి, ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిల నేపథ్యంలో ఎయిర్టెల్ సుమారు 3 బిలియన్ డాలర్ల (దాదాపు రూ 21,000 కోట్లు) నిధులను వివిధ మార్గాల్లో సమీకరించాలని నిర్ణయించింది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేసెమెంట్ (క్యూఐపీ) విధానం ఇందుకోసం అనుసరించాలని భావిస్తున్నట్లు స్టాక్ ఎక్స్చేంజి లకు వెల్లడించింది. ఇందులో భాగంగా సుమారు 2 బిలియన్ డాలర్లను ఈ విధానంలో సమీకరించి, మరో 1 బిలియన్ డాలర్లను బాండ్స్ లేదా డిబెంచర్ల రూపంలో సేకరించనున్నట్లు తెలిపింది. ఏది ఏమైనా మన దేశానికి గర్వకారంగా ఉన్న ఎయిర్టెల్ ... ఇకపై విదేశీ కంపెనీ అంటే తమ కస్టమర్ల నుంచి సాధారణ పౌరుల వరకు జీర్ణించుకోవటం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications