ముంబై: కార్పొరేట్ సెక్టార్‌లో వార్తల్లో నిలిచిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విశాల్ గార్గ్.. హఠాత్తుగా సెలవుల్లోకి వెళ్లాడు. ఆయన పని చేస్తోన్న కంపెనీ యాజమాన్యం ఆయనను సెలవుల్లోకి పంపించింది. ఈ మేరకు అధికారికంగా ఇమెయిల్ ద్వారా ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. తాను చేసిన పనికి ఆయన ఇదివరకే కంపెనీ యాజమాన్యానికి క్షమాపణ కోరాడు. ఆ వెంటనే- ఆయన సెలవుల్లోకి వెళ్లడం మరోసారి కార్పొరేట్ సెక్టార్‌లో చర్చనీయాంశమైంది.
ఈ సెలవులు తాత్కాలికమేనని తెలుస్తోంది. ఆయన స్థానంలో కెవిన్ ర్యాన్‌ను నియమించిందా కంపెనీ మేనేజ్‌మెంట్. ప్రస్తుతం కెవిన్ ర్యాన్ చీఫ్ ఫైనాన్షిల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా పని చేస్తోన్నారు. ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించింది. బోర్డ్ డైరెక్టర్స్‌కు రిపోర్ట్ చేయాలని సూచించింది. విశాల్ గార్గ్ మళ్లీ విధుల్లో చేరేంత వరకూ కంపెనీ రోజువారీ కార్యకలాపాలు, నిర్ణయాలు తీసుకునే హక్కు కెవిన్‌కు ఉందని స్పష్టం చేసింది. దీనితోపాటు- కల్చరల్ అసెస్‌మెంట్ కోసం ఇండిపెండెంట్ థర్డ్ పార్టీని నియమించింది.
విశాల్ గార్గ్.. బెటర్ డాట్ కామ్ సంస్థకు ముఖ్య కార్యనిర్వహణాధికారి. కొద్దిరోజుల కిందటే జూమ్ కాల్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. 900 మంది ఉద్యోగులను తొలగించారు. దీనికి ఆయన ఎలాంటి కారణాలను చూపించలేదనేది ఉద్యోగుల ఆరోపణ. మూడే మూడు నిమిషాల్లో జూమ్ కాల్ కాన్ఫరెన్స్ నిర్వహించిన విశాల్ గార్గ్.. మొత్తంగా 900 మంది ఉద్యోగులను తొలగించారు. అప్పటికప్పుడు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

దీనికి సంబంధించిన వివరాలు.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. విశాల్ గార్గ్‌పై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు నెటిజన్లు. బెటర్ డాట్ కామ్ కంపెనీ యాజమాన్యం తీరునూ తప్పు పట్టారు. ఎలాంటి కారణాన్ని చూపించకుండా ఒకేసారి 900 మంది ఉద్యోగులను విధుల్లో నుంచి తొలగించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమైంది. అటు కార్పొరేట్ సెక్టార్‌లో సంచలనంగా మారింది. దీనిపై బెటర్ డాట్ కామ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు.
ఉద్యోగులను తొలగించిన తరువాత విశాల్.. క్షమాపణలు కోరాడు. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు ఇమెయిల్ ద్వారా సందేశాన్ని పంపించాడు. దీనితో ఈ వివాదం సద్దమణిగినట్టేనని భావించినప్పటికీ.. అక్కడే అనూహ్య మలుపు తిరిగింది. ఉన్నట్టుండి ఆయనను సెలవుల్లోకి పంపించడం కలకలం రేపింది. ఏకంగా ఓ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సెలవుల్లోకి వెళ్లాల్సి రావడం కార్పొరేట్ సెక్టార్‌లో చర్చనీయాంశమైంది. ఇది తాత్కాలికమేనని బెటర్ డాట్ కామ్ యాజమాన్యం చెబుతోంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications