భార్యకు నెలకు రూ.25,000 అద్దె కడుతున్న భర్త.. బెంగళూరు టెక్కీ ఐడియా చూస్తే మైండ్ బ్లాకే!

ఈ రోజుల్లో ట్యాక్స్ (Income Tax) ఎలా సేవ్ చేసుకోవాలో తెలియక చాలా మంది ఐటీ ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. అయితే బెంగళూరు (Bengaluru) లో ఉండే ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కనిపెట్టిన ఐడియా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో వైరల్ అవుతోంది. టాక్స్ తగ్గించుకోవడం కోసం అతను ఏకంగా తన భార్యకే ప్రతి నెలా అద్దె కడుతున్నాడు. వినడానికి వింతగా ఉన్నా.. ఇది ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది.

Bengaluru techie pays rent to wife to save tax HRA claim social media viral financial debate

అసలు మ్యాటర్ ఏంటంటే?

ఎక్స్ (ట్విట్టర్) యూజర్ ప్రథమ్ ఖన్నా షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రకారం.. అతని ఫ్రెండ్ ఒకరు బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఏడాదికి రూ.18 లక్షల ప్యాకేజీ ఉంది. కంపెనీ నుంచి అతనికి ప్రతి నెలా హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) కింద రూ.30,000 వస్తుంది. అయితే అతను తన పేరు మీద ఇల్లు కొనకుండా, ఒక స్మార్ట్ ప్లాన్ వేశాడు. అతని భార్య తన సొంత సేవింగ్స్, హోమ్ లోన్ కలిపి ఒక ఫ్లాట్ కొనుగోలు చేసింది.

ఇప్పుడు ఆ టెక్కీ తన భార్య పేరు మీద ఉన్న ఇంట్లోనే ఉంటూ.. ప్రతి నెలా రూ.25,000 అద్దెను భార్య బ్యాంక్ అకౌంట్‌కు ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాడు. ఇలా చేయడం వల్ల భర్త తన HRA మొత్తాన్ని చూపించి ట్యాక్స్ మినహాయింపు పొందుతున్నాడు.

ఒకే ఇల్లు.. రెండు లాభాలు!

ఈ ప్లాన్ వల్ల ఆ కుటుంబానికి డబుల్ బెనిఫిట్ వస్తోందని ప్రథమ్ ఖన్నా రాసుకొచ్చాడు. మొదటిది.. భర్తకు ట్యాక్స్ తగ్గుతుంది. రెండోది.. భార్యకు వచ్చే రెంట్ అమౌంట్‌పై ట్యాక్స్ రూల్స్ ప్రకారం 30 శాతం స్టాండర్డ్ డిడక్షన్ లభిస్తుంది. పైగా ఆస్తి కూడా కుటుంబంలోనే ఉంటుంది. డబ్బు సంపాదించడమే కాదు, ట్యాక్స్ రూల్స్ తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం అంటూ అతను పోస్ట్ పెట్టాడు.

నెటిజన్ల కౌంటర్లు.. ఐటీ రూల్స్ ఏమంటున్నాయి?

అయితే ఈ ఐడియా చూసి అందరూ మెచ్చుకోవట్లేదు. కొంతమంది ఇది చాలా తప్పుడు నిర్ణయం అని హెచ్చరిస్తున్నారు. ఒక యూజర్ స్పందిస్తూ.. "ఇలాంటి ట్రిక్స్ కేవలం ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ (Old Tax Regime) లోనే పనికొస్తాయి. కొత్త ట్యాక్స్ విధానంలో HRA బెనిఫిట్స్ ఉండవు. కాబట్టి లెక్కలు వేసుకుంటే పెద్దగా లాభం ఉండకపోవచ్చు" అని కామెంట్ చేశారు.

మరికొందరైతే భవిష్యత్తులో ఫ్యామిలీ గొడవలు వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇల్లు లీగల్‌గా భార్య పేరు మీదే ఉంటుంది కాబట్టి, భర్తకు దానిపై ఎలాంటి హక్కులు ఉండవని గుర్తు చేస్తున్నారు. వీటన్నిటికీ మించి, ఈ మధ్య కాలంలో ఐటీ ఫామ్స్ సబ్మిట్ చేసేటప్పుడు ఇంటి ఓనర్‌తో ఉన్న రిలేషన్‌షిప్‌ను కూడా స్పష్టంగా మెన్షన్ చేయాలనే రూల్ వచ్చింది. దీనివల్ల ఇలాంటి లావాదేవీలపై ఐటీ అధికారుల నిఘా పెరిగే అవకాశం ఉంది.

లాంగ్ టర్మ్‌లో జాగ్రత్త సుమా!

ఫైనాన్షియల్ నిపుణుల ప్రకారం.. ఈ అద్దె చెల్లింపులు కేవలం పేపర్ల మీద మాత్రమే కాకుండా నిజంగా జరగాలి. బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ రికార్డులు, రెంట్ అగ్రిమెంట్, భార్య ఐటీ రిటర్న్స్‌లో ఆ రెంట్ ఆదాయాన్ని చూపించడం వంటివన్నీ పక్కాగా ఉంటేనే ఇది చెల్లుతుంది. లేదంటే ఐటీ నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది. ఏదేమైనా, ట్యాక్స్ సేవింగ్ కోసం బెంగళూరు టెక్కీ వేసిన ఈ ప్లాన్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+