బెంగళూరు రియల్ ఎస్టేట్ జోరు.. 2035 వరకు ఆసియా-పసిఫిక్‌లో నంబర్ వన్ రారాజుగా భారత సిలికాన్ సిటీ..

Bengaluru Office Market Outlook 2035: భారత ఐటీ రాజధాని, సిలికాన్ సిటీ శరవేగంగా ముందుకు దూసుకుపోతోంది. కార్పోరేట్ స్పేస్ రంగంలో దానిని ఢీకొట్టే నగరం కనుచూపుమేరలో కనపడటం లేదు. అంతర్జాతీయ వాణిజ్య రియల్ ఎస్టేట్ సేవల సంస్థ 'కుష్మాన్ & వేక్‌ఫీల్డ్' (Cushman & Wakefield) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. ఆసియా-పసిఫిక్ (APAC) ప్రాంతంలో కొత్త కార్యాలయ భవనాల అభివృద్ధికి బెంగళూరు అత్యంత బలమైన మరియు లాభదాయకమైన మార్కెట్లలో ఒకటిగా నిలుస్తోంది.

టెక్నాలజీ కంపెనీలు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల (GCCs) నుండి నిరంతరం వస్తున్న డిమాండ్ కారణంగా 2035 వరకు ఈ నగరంలో కొత్త ఆఫీస్ ప్రాజెక్టుల నిర్మాణం వాణిజ్యపరంగా ఎంతో లాభదాయకంగా కొనసాగుతుందని ఈ నివేదిక అంచనా వేసింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని అనేక ప్రధాన నగరాల్లో పెరుగుతున్న నిర్మాణ ఖర్చులు, అధిక రుణ వ్యయాలు, ప్రతికూల ప్రాజెక్ట్ ఆర్థిక పరిస్థితులు కొత్త నిర్మాణాలను పరిమితం చేస్తున్న తరుణంలో.. బెంగళూరు మాత్రం సానుకూల అద్దె వృద్ధితో డెవలపర్లు, పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షిస్తోంది.

Bengaluru office market Bengaluru real estate Asia Pacific office hub office development 2035 Cushman and Wakefield report GCC demand India technology companies Bengaluru office rental growth commercial real estate India Bengaluru office rents office space demand property market outlook 2035 GCC

నివేదికలోని గణాంకాలను పరిశీలిస్తే.. ప్రస్తుతం బెంగళూరులో ప్రైమ్ మార్కెట్ అద్దెలు, నిర్మాణ వ్యయాలను రాబట్టుకునేందుకు అవసరమైన ఆర్థిక అద్దెల (Economic Rents) కంటే 16 శాతం ఎక్కువగా ఉన్నాయి. కొత్త కార్యాలయాల నిర్మాణానికి ఇది ఆరోగ్యకరమైన లాభదాయకత మార్జిన్‌ను సూచిస్తోంది. రాబోయే దశాబ్దంలో ఈ అంతరం మరింత విస్తరిస్తుందని నివేదిక పేర్కొంది; 2030 నాటికి ప్రధాన మార్కెట్ అద్దెలు ఆర్థిక అద్దెల కంటే సుమారు 29 శాతం, 2035 నాటికి ఏకంగా 44 శాతం అధికంగా ఉంటాయని అంచనా వేసింది.

Also Read

బెంగళూరులో ప్రైమ్ అద్దెలు ఏటా సగటున 5.0 శాతం చొప్పున పెరుగుతాయని.. ఇది ఆర్థిక అద్దెలలో అంచనా వేసిన 2.5 శాతం వార్షిక వృద్ధి కంటే రెట్టింపు కావడం విశేషం. టెక్, జీసీసీ రంగాల నిరంతర విస్తరణే నగర దీర్ఘకాలిక అభివృద్ధి సాధ్యాసాధ్యాలకు బలమైన పునాది వేస్తోందని కుష్మాన్ & వేక్‌ఫీల్డ్ బెంగళూరు ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్ రమిత అరోరా వివరించారు.

ఇతర ప్రధాన ఆసియా-పసిఫిక్ మార్కెట్లతో పోలిస్తే బెంగళూరు స్థితి ఎంతో మెరుగ్గా ఉందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. విశ్లేషించిన ఐదు ప్రధాన ఏపీఏసీ మార్కెట్లలో దక్షిణ కొరియా రాజధాని సియోల్ ప్రస్తుతం 26 శాతం మార్జిన్‌తో అగ్రస్థానంలో ఉండగా, బెంగళూరు రెండో అత్యంత ఆకర్షణీయ మార్కెట్‌గా నిలిచింది. ఈ రెండు నగరాలు మాత్రమే 2035 వరకు కొత్త ఆఫీస్ ప్రాజెక్టులకు అనుకూలంగా ఉంటాయని అంచనా.

దీనికి భిన్నంగా, సింగపూర్‌లో స్థల కొరత మరియు ఖర్చుల వల్ల కొత్త నిర్మాణాల కంటే పాత భవనాల పునరాభివృద్ధిపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. జపాన్ రాజధాని టోక్యోలో కార్యాలయాల ఖాళీల రేటు కేవలం 0.3 శాతంగా అత్యల్ప స్థాయిలో ఉన్నప్పటికీ.. పెరుగుతున్న ఫైనాన్సింగ్ ఖర్చులు, క్యాపిటలైజేషన్ రేట్ల కారణంగా 2030 తర్వాత అక్కడ కొత్త ప్రాజెక్టుల లాభదాయకత తగ్గుతుందని నివేదిక పేర్కొంది. ఇక ఆస్ట్రేలియాలోని సిడ్నీ అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. అక్కడ ఆర్థిక అద్దెలు మార్కెట్ అద్దెల కంటే 24 శాతం ఎక్కువగా ఉండటంతో 2035 వరకు కొత్త నిర్మాణాలకు తీవ్ర ప్రతిబంధకాలు కొనసాగనున్నాయి.

మొత్తానికి చూసినట్లయితే బలమైన అద్దెదారుల డిమాండ్, అపారమైన సాంకేతిక ప్రతిభావంతుల లభ్యత, ఆశాజనకమైన అద్దె వృద్ధి కారణంగా ఆసియా-పసిఫిక్ వాణిజ్య రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు బెంగళూరు అత్యంత కీలక గమ్యస్థానంగా అవతరించిందని కుష్మాన్ & వేక్‌ఫీల్డ్ నివేదిక తేల్చిచెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+