భారతదేశ ఐటీ రాజధాని, సిలికాన్ సిటీ బెంగుళూరులో ఇల్లు అద్దెకు తీసుకోవాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. నెల అద్దెకన్నా దానికి చెల్లించే సెక్యూరిటీ డిపాజిట్ తో అద్దె దారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది సోషల్ మీడియాలో దీనిపై ఆవేదనతో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు చాలా మంది. బెంగుళూరు నగరంలో యజమానుల దోపిడిపై సోషల్ మీడియా వేదికగి విమర్శలు గుప్పించారు. మరి ఇంత దారుణమా అంటూ మండిపడ్డారు. తాజాగా మరోసారి బెంగళూరు అద్దె ఇంటికి సెక్యూరిటీ డిపాజిట్ అంశం వైరల్ అవుతోంది.
ఎక్స్ వేదికగా ఓ నెటిజన్ Bengaluru లో అద్దె డిపాజిట్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంటి అద్దెకు యజమాని సెక్యూరిటీ కింద రూ. 23 లక్షలు డిపాజిట్ చేయాలని సూచించాడని పోస్ట్ ద్వారా తెలిపాడు. ఈ పోస్టుతో బెంగళూరులో పెరుగుతున్న అద్దె ఖర్చులపై సోషల్ మీడియాలో మళ్లీ హాట్ డిబేట్ నడుస్తోంది. ఒక నెటిజన్ తన పోస్ట్‌లో ఇండిపెండెంట్ హౌస్ కోసం యజమాని రూ. 23 లక్షల డిపాజిట్ అడుగుతున్న ప్రకటన షేర్ చేశారు. ఈ మొత్తం 12 నెలల అద్దెకు సమానమని వాపోయాడు. ఇది చాలా మంది నెటిజన్లను షాక్‌కు గురి చేసిందనే చెప్పుకోవచ్చు.

ఆ పోస్ట్ ప్రకారం చూసినట్లయితే.. 4BHK పూర్తి ఫర్నీచర్ కలిగిన 4,500 చదరపు అడుగుల ఇల్లు నెలకు రూ. 2.3 లక్షల అద్దెకు మాట్లాడారు. అయితే ఇంటి అద్దెతో ఎటువంటి సమస్యలేదు. కాని సమస్యల్లా యజమాని డిమాండ్ చేసిన భారీ డిపాజిట్ మొత్తం పైనే. ఇంటి యజమాని సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 23 లక్షల డిపాజిట్ అడిగాడని అతను తెలిపాడు. బెంగళూరు యజమానులు ప్రపంచంలోనే అత్యంత ధన దాహం కలిగి ఉన్నారంటూ మండిపడ్డారు.
బెంగళూరులో రూ.20 వేల అద్దెకు రూ.2 లక్షల డిపాజిట్.. ఇదేం దోపిడి అంటూ మండిపడుతున్న నెటిజన్లు
న్యూయార్క్, టోరంటో, సింగపూర్, లండన్, దుబాయ్ వంటి ప్రపంచ నగరాల డిపాజిట్ ప్రమాణాలతో దీన్ని పోల్చి చూపించారు నెటిజన్. ఇక్కడ ఒకటి నుండి రెండు నెలల అద్దె లేదా వార్షిక అద్దె 5-10 శాతం వరకు మాత్రమే డిపాజిట్‌గా తీసుకుంటారన్నారు. అయితే బెంగుళూరులో చాలా విచిత్రంగా 12 నెలల అద్దె డిపాజిట్ అనేది అసాధారణంగా ఉందని ఇది చాలా అన్యాయమని తెలిపాడు. ఈ పోస్టులోని అంకెలను చూసి చాలామంది ఆశ్చర్యపోయినా కొంతమంది మాత్రం బెంగళూరులో ఇది సర్వసాధారణమే అని బదులిచ్చారు.
సాధారణంగా 5-6 నెలల అద్దె డిపాజిట్ డిమాండ్ చేస్తారని.. అయితే తక్కువ నమ్మకం ఉన్న అద్దె సంస్కృతి కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. గృహ ఖర్చులు ఎక్కువగా ఉండటంతో అద్దె డిపాజిట్లు కూడా పెరిగాయని మరికొంతమంది బదులిచ్చారు. మరికొందరు ఇంకాస్త ముందుకు వెళ్లి యజమానులపై మాత్రమే కాకుండా అద్దెకుంటున్న వారిపైనా కూడా విమర్శలు ఎక్కుపెట్టారు. అద్దెదారులు యజమానులు అడిగిన మొత్తాన్ని చెల్లిస్తున్నారని తగ్గించమంటే వారు తగ్గిస్తారు కదా అని చెబుతున్నారు. పెద్ద మొత్తాలు ఇచ్చేసి, ఇప్పుడు మొత్తం మార్కెట్ చెడిపోయిందంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
ఇక చాలామంది నెటిజన్లు అద్దె ఇళ్లలో డిపాజిట్లతో పాటు యజమానులు పెట్టే నిబంధనలు కూడా ప్రశ్నిస్తున్నారు. నాన్-వెజ్ వంటలపై నిషేధం, రాత్రిపూట అతిథులను అనుమతించకపోవడం, స్నేహితులను ఇంటికి పిలిచే విషయంలో ఆంక్షలు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. అద్దె ఇస్తూ కూడా యజమాని పెట్టే కండీషన్లకు తలపోటు వస్తుంటుందని వాపోతున్నారు. ఏదైమైనా బెంగళూరు నగరంలో అద్దెదారులకు అనుకూలంగా చట్టాలు లేకపోవడం వల్ల యజమానులు ఇష్టం వచ్చినట్లుగా డిమాండ్ చేస్తున్నారని మండిపడుతున్నారు.
More From GoodReturns

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్.. తిండి కోసం విలవిలలాడుతున్న ఫుడ్ ప్రేమికులు..

బెంగళూరు ఆటో డ్రైవర్ల ఫోన్ వ్యసనంపై హాట్ డిబేట్.. సాప్ట్వేర్ ఇంజనీర్ ఆందోళనపై ఎవరేమన్నారంటే..

Bengaluru: బడ్జెట్లో బెంగళూరు కోసం మాస్టర్ ప్లాన్..! రాబోతున్న కొత్త ప్రాజెక్టులు ఇవే!

Bengaluru: స్టార్టప్ పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ ఎంట్రప్రెన్యూర్ చెప్తున్న చేదు నిజాలు వినాల్సిందే!

ఫ్రిజ్‌లో పండ్లు దొంగిలించిన పని మనిషి.. వెంటనే యజమానిని అలర్ట్ చేసిన AI..ఆ తర్వాత ఏమైందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications