బెంగళూరులో రూ.20 వేల అద్దెకు రూ.2 లక్షల డిపాజిట్.. ఇదేం దోపిడి అంటూ మండిపడుతున్న నెటిజన్లు

బెంగళూరులో అద్దె డిపాజిట్లపై నెటిజన్ల నుంచి సోషల్ మీడియాలో మరోసారి తీవ్ర ఆగ్రహం చెలరేగింది. సిలికాన్ సిటీలో నెలకు రూ. 20 వేల అద్దెకు రూ.2 లక్షల డిపాజిట్?" అనే రెడిట్ పోస్ట్ ఒక్కసారిగా వైరల్ అయ్యి నెటిజన్లలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది. ఈ పోస్ట్‌కు వందల సంఖ్యలో నెటిజన్లు కామెంట్లు పెట్టారు. వేలాదిమంది తమ అనుభవాలను, బాధలను ఈ పోస్ట్ ద్వారా స్పందించారు. చాలా మంది బెంగళూరులో అద్దె ఇళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులను షేర్ చేసుకున్నారు.

మరికొందరు నెటిజన్లు హాస్యం, వ్యంగ్యం ద్వారా పరిస్థితిని కూల్ చేయడానికి ప్రయత్నించారు. ఇది బెంగుళూరు నగరంలో సాధారణమే అని ప్రజలు అంగీకరించడంతో 10 నెలల అద్దెకు సమానమైన డిపాజిట్ అడగడం ఎప్పటి నుంచి ఉందని చాలామంది చెప్పుకొచ్చారు. ఇంకొకరు పూణే, హైదరాబాద్ వంటి నగరాల్లో సాధారణంగా 2-3 నెలల డిపాజిట్ మాత్రమే అడుగుతారని, బెంగళూరు అద్దె సంస్కృతిని నూతన వాసులకు లేదా కొత్తగా అడుగు పెట్టే విద్యార్థులకు సహజంగా భారం చేస్తున్నదని తెలిపారు.

Bengaluru rental crisis Bengaluru house rent Bengaluru rental deposits Rs 2 lakh deposit Bengaluru Rs 20k rent Bengaluru Bengaluru housing problem Bengaluru rent hike Bengaluru tenants reaction Bengaluru real estate viral rental news India social media outrage Bengaluru Bengaluru rental market

సోషల్ మీడియా అంతటా ఇదే చర్చ నడుస్తోంది. మరొకరు తమ అనుభవాన్ని పంచుకుంటూ.. "చెన్నైలోనూ ఇదే పరిస్థితి. మా అద్దె రూ. 26,000 అయితే డిపాజిట్ రూ. 2.6 లక్షలు అడిగారు. ఇక్కడ 10 నెలల అడ్వాన్స్ పాలసీ నడుస్తోందన్నారు. అందరూ దీన్ని అంగీకరించడాన్ని ఆపివేయాలి. 10 మంది వరుసగా నో చెప్పారంటే..యజమాని తగ్గాల్సిందేనని మరొక నెటిజన్ చెప్పుకొచ్చారు.

ఎందుకు బెంగుళూరు నగరంలో యజమానులు ఇంత ఎక్కువ డిపాజిట్ అడుగుతారంటే..ఇంటి యజమానులు మెయింటెనెన్స్ ఖర్చులు, మరమ్మత్తులు, పూత వేయడం, ఫ్యాన్స్, గీజర్లు వంటి ఫిక్చర్లు ఖరీదైనవని చెబుతున్నారు. అయితే ఇది కేవలం యజమానులకే లాభంగా మారిందని నెటిజన్లు చెబుతున్నారు. పూణే, హైదరాబాద్ వంటి నగరాల్లో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు కంట్రోల్ వహిస్తుంటే, బెంగళూరులో అలాంటి నియంత్రణ లేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

కరోనా మహమ్మారి సమయంలో రిమోట్ వర్క్ వల్ల అద్దె ధరలు తగ్గినా, ఇప్పుడు మళ్లీ ఆఫీసులకు వెళుతున్న వాళ్ల సంఖ్య పెరగడంతో వాళ్లు ఇళ్లు వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. యజమానులు మళ్లీ పైచేయి సాధించారు. ప్రస్తుతం అద్దెదారులే ఈ వ్యవస్థను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అంటున్నారు.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+