A Oneindia Venture

IT News: టెక్ ఫ్రెషర్లకు రూ.20 వేలు జీతం ఎక్కువే..!బెంగుళూరు వ్యాపారవేత్త షాకింగ్ కామెంట్స్

IT Jobs: దేశంలో టెక్ ఉద్యోగుల విషయంలో పెద్ద గందరగోళం నడుస్తోంది. కొందరూ మాత్రం నెలకు లక్షల్లో వేతనాలు అందుకుంటూ అవి కూడా సరిపోవటం లేదని గగ్గోలు పెడుతుంటే.. మరోపక్క ఫ్రెషర్లకు నెలకు రూ.20 వేలు చెల్లించటం బొక్కే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

వాస్తవానికి ఇటీవల అమెరికా కేంద్రంగా భారతదేశంలో పనిచేస్తున్న టాప్ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ ఇటీవల ఆఫ్-క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ తర్వాత భారతీయ ఐటీ రంగంలో వేతనాలపై చర్చ తీవ్రతరమైంది. ఈ క్రమంలో కంపెనీ ఫ్రెషర్లకు రూ.2.50 లక్షలు వార్షిక ప్యాకేజీని ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. అంటే నెలకు రూ.20,000 జీతంగా వారు పొందుతారు. చాలా మంది ఐటీ ఆశావహులు ఇది చాలా తక్కువని ఆవేదన వ్యక్తం చేస్తుంటే పరిశ్రమ నుంచి ఇది చెల్లించటమే వారికి ఎక్కువనే టాక్ వినిపిస్తోంది.

Bengaluru entrepreneur says 20k Salary for IT freshers is Overspending sparks discussion

వివరాల్లోకి వెళితే.. తాజాగా బెంగుళూరుకు చెందిన టెక్ వ్యవస్థాపకుడు వత్సల్ సంఘ్వి గ్రాడ్యుయేట్‌లకు కాగ్నిజెంట్ వార్షిక ప్యాకేజీ రూ.2.52 లక్షలు ఆఫర్ చేయటంపై కీలక కామెంట్స్ చేశారు. టెక్ ఫ్రెషర్లలో నైపుణ్యాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. చాలా మందికి కనీసం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవని, కనీసం కోడింగ్ సైతం సరిగా రానివారు ఎక్కువగా ఉన్నారన్నారు. అసలు కార్పొరేట్ కంపెనీలో ఎలా ప్రవర్తించాలో చాలా మందికి తెలియదని తన ట్వీట్ లో సంఘ్వి పేర్కొన్నారు. కంపెనీ వారికి అందిస్తున్నది వేతనం కాదని అది ట్రైనింగ్ స్ట్రైఫండ్ మాత్రమేనని చెబుతూ నెలకు రూ.20 వేలు చెల్లించటం కూడా ఓవర్ స్పెండింగ్ అంటూ కామెంట్ చేశారు.

ఓపెన్ జాబ్ మార్కెట్లో నచ్చని వేతనాలకు జాబ్ కోసం అప్లై చేయాల్సిన అవసరం లేదని వత్సల్ సంఘ్వి అన్నారు. తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు అనేక అవకాశాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దేశంలో మనందరికీ ఉచిత డబ్బు కావాలని, ఖరీదైన ఆఫీసులలో కూర్చున్న వారికి గ్రౌండ్ రియాలిటీ గురించి ఒక్క ఆలోచన కూడా లేకుండా ప్రతిదానిపై ఒక అభిప్రాయం ఉంటుందని సంఘ్వి పేర్కొన్నారు. దీనిపై మరో వ్యక్తి స్పందిస్తూ గణనీయమైన ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ, 2006 నుండి జీతం ప్యాకేజీ మారకుండా ఉందని పేర్కొన్నారు.

కాగ్నిజెంట్ ఆఫర్:
కంపెనీ ఇటీవలి ఆఫ్-క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ తర్వాత భారతీయ ఐటీ రంగంలో వేతనాలపై చర్చ తీవ్రమైంది. సోషల్ మీడియాలో దీనిపై మీమ్స్ కూడా కనిపించాయి. కంపెనీ తాజా గ్రాడ్యుయేట్‌లకు రూ.2.5 లక్షలు లేదా నెలకు రూ.20,000 వార్షిక పరిహారం ప్యాకేజీని ఆఫర్ చేసింది. ఇది సెక్టార్‌కి కొత్త కనిష్ట స్థాయిని సూచిస్తుంది. అయితే వాస్తవానికి సాంప్రదాయకంగా ఎంట్రీ-లెవల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌ల జీతాలను సంవత్సరానికి రూ.3.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు అందిస్తుంది. కాగ్నిజెంట్ నుంచి తక్కువ ఆఫర్ ప్రాథమిక జీవన ఖర్చులను ఎలా కవర్ చేస్తుందని చాలా మంది సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+