Cricket: దేశంలో ప్రజలు పలు వేడుకలు జరుపుకుంటున్నా.. కుల, మత, ప్రాంత బేధం లేకుండా అందరూ ఏకమై చేసుకునే పండుగ క్రికెట్. ఇక IPL జరుగుతుంది అంటే క్రికెట్ అభిమానుల్లో ఉండే జోషే వేరు. క్రికెట్ ను ఇంతగా ఆరాధిస్తున్నారు కాబట్టే ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) కొనసాగుతోంది.
పరిమితికి మించి ఆదాయం పొందుతున్న ఏ సంస్థ అయినా ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సిందే కదా. మరి ఏటా భారీ మొత్తంలో ఆర్జించే BCCI ఎంత ట్యాక్స్ కట్టిందో తెలుసా..? 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను 1,159 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించింది. అయితే అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 37 శాతం ఎక్కువ కావడం గమనార్హం.

రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. BCCI దాఖలు చేసిన రిటర్నుల ఆధారంగా గత ఐదేళ్లలో ఆ సంస్థ చెల్లించిన ఆదాయపు పన్ను, రాబడి, ఖర్చు వివరాలు తెలియజేశారు.

2021-22 ఆర్థిక సంవత్సరంలో 7 వేల 606 కోట్ల రూపాయల ఆదాయాన్ని BCCI ఆర్జించగా.. దాని వ్యయం దాదాపు 3 వేల 64 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. 2020-21లో 844.92 కోట్లు, 2019-20లో 882.29 కోట్లు, FY2019లో 815.08 కోట్లు, 2017-18లో 596.63 కోట్ల మేర ట్యాక్స్ పే చేసినట్లు స్పష్టం చేశారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications