Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి 13 రోజులు సెలవులు..!

విద్యార్థులకు గుడ్ న్యూస్ రేపటి నుంచి బతుకమ్మ, దసరా సెలవులు రానున్నాయి. బతుకమ్మ, దసరా సందర్భంగా తెలంగాణలో పాఠశాలలకు 13 రోజులు సెలవులను ప్రకటించారు. ఈ సెలవులు అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 22 వరకు ఉంటాయి. అక్టోబర్ 23న పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి. ఇక జూనియర్ కాలేజీలకు మొత్తం 12 రోజులు సెలవులు ఉండనున్నాయి. అంటే పాఠశాలల కంటే ఒక రోజు సెలవు తక్కువ. జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 21 సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 22న జూనియర్ కాలేజీలు పున ప్రారంభం అవుతాయి. తెలంగాణలో రేపటి నుంచి బతుకమ్మ కూడా మొదలు కాబోతుంది.

దీంతో పల్లెల్లో సందడి నెలకొంది. స్కూల్లు, పాఠశాలల్లో చదువుకునే వారు రేపు సాయంత్రంలోకా సొంతూళ్లకు చేరుకునేందుకు ప్లాన్ చేశారు. బతుకమ్మ, దసరా సెలవుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వివిధ మార్గాల్లో 7,000 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తం బస్సులలో కరీంనగర్ జోన్ నుంచి 3,533 బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. అలాగే ఆదిలాబాద్ నుంచి 431, నిజామాబాద్ నుంచి 719, వరంగల్ నుంచి 530, ఖమ్మం నుంచి 678, హైదరాబాద్ నుంచి 2,155 బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ పేర్కొంది. వీటితో పాటు మహబూబ్‌నగర్ నుంచి కనీసం 645, మెదక్ నుంచి 255, నల్గొండ నుంచి 815, రంగారెడ్డి నుంచి 440, గ్రేటర్ హైదరాబాద్ జోన్ నుంచి 1,312 ప్రత్యేక బస్సు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

Holidays

అక్టోబర్ 9, 10, 16, 17 తేదీలలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి అప్పటికప్పుడు ప్రత్యేక బస్సులు నడిపే అవకాశం ఉంది. అక్టోబర్ 9 నుంచి 26 మధ్య ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండేలా TGSRTC యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేసింది. పండగకు ముందు 9, 10 తేదీలు, అలాగే 16, 17 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే అక్టోబర్ 25, 26 తేదీలలో తిరుగు ప్రయాణంలో కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు.

అటు ఏపీలోనూ రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 21 వరకు ఏపీలో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అంటే మొత్తం 12 రోజుల పాటు దసరా సెలవులు ఉండనున్నాయి. దసరా సందర్భంగా ఏపీ ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు నడపనుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రవ్యాప్తంగా 5వేల 261 ప్రత్యేక బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైతో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పుణ్యక్షేత్రాలకు స్పెషల్ బస్సులు నడపనున్నట్లు తెలిపింది ఆర్టీసీ. ఈ ఏడాది దసరా ఉత్సవాలు అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానున్నాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+