టెక్స్‌టైల్ పరిశ్రమ పెట్టుబడిదారులకు అనేక మల్టీ-బ్యాగర్ స్టాక్‌లను అందించింది. అందులో బరోడా రేయాన్ కార్పొరేషన్ కంపెనీ ఒకటి. శుక్రవారం ఇంట్రాడే ప్రాతిపదికన, బరోడా రేయాన్ కార్పొరేషన్ షేర్లు 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయింది. BSEలో 52 వారాల గరిష్ట స్థాయి రూ.329.05 కు చేరింది. బ్యాక్-టు-బ్యాక్ అప్పర్ సర్క్యూట్‌లను తాకుతోంది.ఈ స్టాక్ ఐదు నెలల్లోపు షేరు 6,991 శాతం పెరిగింది.
రెండో అతిపెద్ద తయారీదారు
ఈ కంపెనీ గుజరాత్ లోని సూరత్ లో ఉంది.ఈ సంస్థ ప్రాథమికంగా ప్రపంచవ్యాప్తంగా వస్త్ర వ్యాపారం చేస్తోంది. విస్కోస్ ఫిలమెంట్ నూలు, నైలాన్ నూలు, పాలిస్టర్ నూలు, ఇతర ఉపఉత్పత్తుల తయారు చేస్తోంది. భారత్ లో ఉత్పత్తి అయ్యే ఫైబర్, నూలు, ఫాబ్రిక్ లో ఈ కంపెనీ మంచి వాటేనే కలిగి ఉంది. ఈ సంస్థ ప్రపంచంలోనే పాలిస్టర్, సిల్క్, ఫైబర్ తయారీలో రెండో అతిపెద్ద తయారీదారుగా ఉంది. ఈ స్టాక్ ఒక్క నెలలో 150 శాతం పెరిగింది.

100 శాతం
కేంద్ర ప్రభుత్వం యూనియన్ బడ్జెట్ 2022-23లో టెక్స్‌టైల్ రంగానికి రూ. 12,382 కోట్ల మొత్తాన్ని కేటాయించింది. ఆటోమేటిక్ రూట్‌లో ఈ రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డిఐ) అనుమతించింది.బరోడా రేయాన్ కార్పొరేషన్ స్టాక్ జూన్ 1న రూ.4.64 వద్ద ఉండగా అక్టోబర్ 14న రూ.329 చేరింది. ఈ స్టాక్ లో ఐదు నెలల క్రితం లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని విలువ రూ.70 లక్షలుగా ఉండేది.

Note: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చాం. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి అధిక రిస్క్ తో కూడుకున్నది. ఇందులో పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించగలరు.


Click it and Unblock the Notifications