కరోనా మహమ్మారి దెబ్బకు భారత్ లాక్ డౌన్‌లో ఉంది. దీనిని మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ నేడు (ఏప్రిల్ 14) ప్రకటించారు. ఈ మూడు వారాల లాక్ డౌన్ సమయంలోనే భారత ఆర్థిక వ్యవస్థ భారీగా పడిపోతుందని రేటింగ్ ఏజెన్సీలు వెల్లడించాయి. ఒక్కో సంస్థ ఒక శాతం నుండి 3.5 శాతం మాత్రమే ఉంటుందని తెలిపాయి. అయితే మొదటిసారి జీడీపీ (గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్) సున్నా శాతంగా ఉంటుందని ఓ రేటింగ్ ఏజెన్సీ తెలిపింది.

భారత వృద్ధి రేటు 0.0 శాతానికి కుదింపు
2020 క్యాలెండర్ ఏడాదిలో భారత వృద్ధి రేటు అంచనాను అంతకుముందు ఉన్న 2.5 శాతం నుండి 0.0 శాతానికి కుదించింది బార్క్స్లే ఎమర్జింగ్ మార్కెట్స్ రీసెర్చ్. అదే సమయంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను వృద్ధి రేటును 3.5 శాతం నుండి 0.8 శాతానికి కుదించింది. ఈ మేరకు బార్క్స్లే తన అంచనాను విడుదల చేసింది.

అందుకే వృద్ధి రేటు కుదింపు
భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో మే 3వ తేదీ వరకు లాక్ డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడింది. లాక్ డౌన్ పొడిగింపు వల్ల ఈ ప్రభావం ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

234.4 బిలియన్ డాలర్ల నష్టం
వివిధ రంగాల్లో ఆర్థిక నష్టం 234.4 బిలియన్ డాలర్లు (జీడీపీలో 8.1 శాతం) ఉంటుందని అంచనా వేసింది. అయితే మే చివరి వరకు లాక్ డౌన్ పొడిగిస్తే ఈ మేర నష్టం ఉంటుందని అంచనా వేసింది. ఇంతకుముందు మొదటిసారి లాక్ డౌన్ ప్రకటన సమయంలో దాదాపు 120 బిలియన్ డాలర్ల నష్టం ఉంటుందని వెల్లడించింది. దాని కంటే దాదాపు రెండింతలు ఉంటుందని తాజా నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో జీడీపీ వృద్ధి రేటును 2020 క్యాలెండర్ ఇయర్లో 2.5 శాతం నుండి 0.0 శాతానికి సమీక్షించినట్లు తెలిపింది.

లాక్ డౌన్
తమ అంచనా ప్రకారం లాక్ డౌన్ పూర్తిగా జూన్ ప్రారంభం నాటికి ముగియవచ్చునని అంచనా ఉందని తెలిపింది. లాక్ డౌన్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగానే ప్రభావం పడుతోందని తెలిపింది. కాగా, వివిధ రేటింగ్ ఏజెన్సీలు కూడా భారత ఆర్థిక వ్యవస్థపై లాక్ డౌన్ ప్రభావం ఎక్కువే ఉంటుందని చెబుతున్నాయి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications