కరోనా మహమ్మారి - లాక్ డౌన్ నేపథ్యంలో ఇటీవలి కాలంలో ఇండ్లు, ఫ్లాట్స్ బుక్ చేసుకొని ప్రారంభంలో ఉన్న వారికి కొత్త చిక్కు వచ్చి పడింది! ప్రస్తుత పరిస్థితుల్లో చాలామందికి వేతనాల్లో కోత విధిస్తున్నాయి కంపెనీలు. ఇంకొంతమంది ఉద్యోగాలు పోతున్నాయి. దీంతో గత రెండు మూడు నెలలుగా తమ తమ ప్రాజెక్టులలో ఫ్లాట్స్ బుక్ చేసుకున్న వారు కొత్త సవాళ్లు ఎదుర్కోవచ్చు.

మీ శాలరీ స్లిప్స్ మళ్లీ సబ్‌మిట్ చేయాల్సి రావొచ్చు
ఫ్లాట్స్ కోసం లోన్ తీసుకుంటే పలు డాక్యుమెంట్లు సమర్పించాలి. లోన్ మంజూరు చేసే బ్యాంకుకు శాలరీ స్లిప్ కూడా తప్పనిసరిగా ఇవ్వాలి. చాలా కంపెనీలు వేతన సవరణ లేదా ఉద్యోగాల కోత చేపట్టిన నేపథ్యంలో గత రెండు నెలల్లో బ్యాంకుల నుండి ఫ్లాట్స్ వంటి వాటి కోసం రుణాలు తీసుకున్న వారు తమ శాలరీ స్లిప్స్ మళ్లీ సబ్‌మిట్ చేయవల్సి ఉంటుంది. మీ చేతికి ఇచ్చే ముందే మీ పే స్లిప్ ఇవ్వాల్సి రావొచ్చు. ఎందుకంటే వారు ఇదివరకటి ఈఎంఐలు చెల్లించగలుగుతారా, ఆ సామర్థ్యం ఉందా తెలుసుకుంటారు.

రుణాల నిలిపివేత
బ్యాంకులు తమ రుణాలను నిలుపుదల చేస్తున్నట్లు పలువురు క్లయింట్స్ గత రెండు నెలలుగా తమ వద్దకు వచ్చినట్లు చెప్పినట్లు ముంబైకి చెందిన ఓ బిల్డర్ తెలిపాడు. ఓ ఫ్లాట్ కోసం ఇప్పటికే 20 శాతం రుణాలు మంజూరు చేసిన బ్యాంకులు కూడా మరో విడత రుణాన్ని లాక్ డౌన్ వంటి వివిధ కారణాల వల్ల నిలుపుదల చేసినట్లు చెబుతున్నారు. హ్యాండోవర్ చేసే ముందు రుణగ్రహీతలు తాము నెల ఈఎంఐ చెల్లించలేమని భావిస్తే ఈ ట్రాన్సాక్షన్ నుండి నిష్క్రమించవచ్చునని, అలాగే పూర్తిగా మీ చేతికి రాకముందే డిఫాల్ట్ అయితే తదుపరి ఇబ్బందులు తలెత్తవచ్చు.

రీ-అసెస్మెంట్
శాలరీ కరెక్షన్స్ నేపథ్యంలో బ్యాంకులు తమ క్లయింట్స్ హోమ్ లోన్స్‌ను రీవ్యాలిడేట్ చేస్తున్నాయి. ఇబ్బందికరంగా కనిపిస్తే తదుపరి రుణ పంపిణీ నిలిపివేస్తున్నాయి. హోమ్ లోన్స్‌కు సంబంధించి బ్యాంకుల నుండి తాము (క్లయింట్స్) క్రమంగా తప్పకుండా రుణాలు పొందుతున్నామని, లాక్ డౌన్ నేపథ్యంలో వీటిని నిలిపివేసినట్లు ముంబైకి చెందిన ఓ బిల్డర్ తెలిపాడు. ఇప్పటికే రెండుమూడుసార్లు మంజూరు చేసినప్పటికీ, రూ.50 లక్షల కంటే పైన హోమ్ లోన్ తీసుకున్న వారికి రీ-అసెస్‌మెంట్ ఉందంటున్నారు.

కొత్తదేమీ కాదు...
కొత్త పేస్లిప్ లేదా కొత్త ఇన్‌కం స్టేట్‌మెంట్ చూడటం కొత్తదేమీ కాదని, తమ సాధారణ మదింపు ప్రక్రియలో భాగంగానే కొత్త శాలరీ స్లిప్స్ అడుగుతున్నట్లు కొన్ని బ్యాంకులు చెబుతున్నాయి. పలు బ్యాంకులు పే స్లిప్స్ లేదా ఆర్థిక సంబంధ వివరాలు మళ్లీ సబ్‌మిట్ చేయాలని చెబుతున్నాయి. లాక్ డౌన్‌కు ముందు సాంక్షన్ అయిన లేదా అండర్ కన్స్ట్రక్షన్ వంటి వాటికి వీటిని అడుగుతున్నాయి.

ఈఎంఐ మారటోరియం ఉంటే.
అంతేకాదు, మారటోరియం ఉపయోగించుకునే వారికి ప్రాసెస్‌లో ఉంటే.. మనీ మంజూరు చేయడం బ్యాంకులు నిలుపుదల చేస్తున్నాయట. అయితే మారటోరియం గడువు ముగిసిన తర్వాత వీటి గురించి ఆలోచిస్తామని చెబుతున్నాయి కొన్ని బ్యాంకులు.ఆర్బీఐ డేటా ప్రకారం బ్యాంకుల హోమ్ లోన్ బుక్ మార్చి 27 నుండి ఏప్రిల్ 24 మధ్య భారీగా పడిపోయింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications