ముంబై: ఆర్థిక నిపుణుల అంచనాలు నిజం చేస్తూ వరుసగా మూడోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది ఆర్బీఐ. ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధి రేటు అంచనాలను కాస్త సానుకూలంగా సవరించింది. ఇదే సమయంలో బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ స్పందించారు. HDFCబ్యాంకు విస్తరణకు ముందు వ్యవస్థలను బలోపేతం చేయాలని కోరుకుంటున్నామని, బ్యాంకు అందుకు కట్టుబడి ఉంటుందని భావిస్తున్నామన్నారు.

HDFC, SBI డిజిటల్ అంతరాయంపై RBI
HDFC బ్యాంకు ఐటీ సిస్టంకు సంబంధించి ఆర్బీఐకి కొన్ని ఆందోళనలు ఉన్నాయని శక్తికాంతదాస్ అన్నారు. మొత్తం మీద బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు, ఇతర రుణదాతలు కస్టమర్లు/ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు ఐటీ వ్యవస్థను మరింత పటిష్టంగా నిర్మించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక సంస్థలు అన్ని కూడా బలమైన ఐటీ పరిష్కారాలపై మరింత దృష్టి సారించి, మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సూచించారు. ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డిజిటల్ సిస్టం అంతరాయాన్ని కూడా అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. ఏమైనా సమస్య పరిష్కారం కోసం ఆర్బీఐ కలిసి పని చేస్తోందన్నారు.

ట్రాన్సాక్షన్స్ పరిమితి పెంపు
ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరింత కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల వాడకాన్ని ఊతమిచ్చే చర్యల్లో భాగంగా కాంటాక్ట్‌లెస్ కార్డు చెల్లింపుల పరిమితినిపెంచాలని ప్రతిపాదించింది. ఇప్పుడున్న కాంటాక్ట్‌లెస్ కార్డు ట్రాన్సాక్షన్స్ పరిమితిని రూ.2 వేల నుండి రూ.5 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2021, జనవరి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుందని శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. కరోనా సమయంలో సమర్ధ, సురక్షిత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అందుబాటులో ఉంటాయన్నారు.
వాణిజ్య, సహకార బ్యాంకులు 2019-20లో వచ్చిన లాభాల్ని నిలుపుకోవాలని సూచించారు. చాలా రంగాలు రికవరీ మార్గంలోకి వస్తున్న క్రమంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటుందన్నారు.

కీలక వడ్డీ రేట్లు అంతే
RBI వరుసగా మూడోసారి కీలక వడ్డీ రేట్లలో మార్పులు చేయలేదు. ద్రవ్యోల్భణం పెరగడం, జీడీపీ ప్రతికూలంగానే ఉండటం వంటి వివిధ కారణాలతో ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా నాలుగు శాతంగా ఉంచింది. రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉంది. బ్యాంకు రేటు 4.25 శాతంగా కొనసాగనుంది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. ద్వైపాక్షిక పరపతి విధాన సమీక్షలో భాగంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ఎంపీసీ మూడు రోజులపాటు సమావేశమైంది. ఇందులో భాగంగా యథాతథ పాలసీ అమలుకే కట్టుబడుతున్నట్లు ఏకగ్రీవంగా ప్రకటించింది. దీంతో రెపో రేటు నాలుగు శాతం వద్ద, రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద కొనసాగనుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications