Anil Ambani: కొన్ని సంవత్సరాల కిందట అంబానీ సోదరుల్లో ఒకడైన అనిల్ దేశంలో అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరిగా, బిలియనీర్ గా కొనసాగారు. కానీ ప్రస్తుతం ఆయన పరిస్థితి దయనీయంగా మారిపోయింది.
ధీరూభాయ్ అంబానీ బతికి ఉన్నంత కాలం అంబానీ సోదరులిద్దరూ కలిసే కంపెనీలను నడిపారు. అయితే 2002లో ధీరూభాయ్ అంబానీ మరణానంతరం అంబానీ సోదరుల మధ్య విభేదాలు తలెత్తటంతో తల్లి కోకిలా బెన్ పిల్లల మధ్య వివాదాన్ని తీర్చేందుకు ఆస్తిని సమానంగా పంచిపెట్టారు. ఈ క్రమంలో 1500 కోట్ల డాలర్ల రిలయన్స్ వ్యాపారాలను సమానంగా ఇచ్చారు. వ్యాపారాలను వేగంగా అభివృద్ధి చేసిన అనిల్ 2008లో 4.2 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 6వ స్థానంలో నిలిచారు.

అప్పట్లో ముఖేష్ అంబానీ కంటే ఎక్కువ సంపదను అనిల్ కలిగి ఉన్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని అనిల్ పతనం నిరూపించింది. అమాంతం పెరిగిన అనిల్ వ్యాపారాలు ఒకదాని తర్వాత మరొకటి పతనం బాట పట్టాయి. దీంతో ఆయన పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. అనిల్ అంబానీ దక్షిణాఫ్రికా సంస్థ MTNతో ఒక వెంచర్‌లో $200 మిలియన్లు పెట్టుబడి పెట్టారు. దీంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అనిల్ అంబానీ ఆర్థిక అవకతవకలు, చైనా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం, జియోలోకి ముఖేష్ అంబానీ ప్రవేశం అనిల్ అంబానీ టెలికాం వ్యాపారం పతనానికి దారితీసింది.
పదేళ్లలో అనిల్ అంబానీ నికర విలువ 4200 మిలియన్ డాలర్ల నుంచి 1700 మిలియన్ డాలర్లకు పడిపోయింది. 2020లో అనిల్ రుణాన్ని తిరిగి చెల్లించలేని కారణంగా కంపెనీ దివాలా తీసినట్లు ప్రకటించారు. లీగల్ ఫీజు చెల్లించేందుకు తన కుటుంబానికి చెందిన నగలను కూడా అమ్మేశానని చెప్పారు. నేడు అనిల్ అంబానీ నేతృత్వంలోని కంపెనీల మొత్తం రూ.40 వేల కోట్లకు పైగా అప్పులు కలిగి ఉన్నాయి.


Click it and Unblock the Notifications