నష్టాల్లో బ్యాంకింగ్ షేర్లు ..తీవ్ర ఒడిదుడుకుల్లో ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్
ఇటీవల కరోనా వైరస్ ప్రభావంతో ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న వేళ దేశీయంగా స్టాక్ మార్కెట్లు ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాలతో కాస్త కోలుకున్నాయి అని భావించిన లోపే నేడు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యింది .
ఆర్‌బీఐ రివర్స్ రేపో రేటు కోత తో పాటుగా వ్యవస్థలో లిక్విడిటీ పెంచేందుకు రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయాలతో స్టాక్ మార్కెట్ కళకళలాడుతుంది ఈ నిర్ణయాల కారణంగా బ్యాంకులకు ఎక్కువ నిధులు అందుబాటులోకి వస్తాయి అని భావిస్తే నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ ఉదయం నుంచి తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. లాభ నష్టాల్లో కొట్టుమిట్టాడుతూ చివరకు ఫ్లాట్ గా ముగిశాయి.

ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 59 పాయింట్లు లాభపడి 31,648కి పెరిగింది. నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో 9,261 వద్ద స్థిరపడింది. ఐటీ, ఎనర్జీ, టెక్ తదితర సూచీలు లాభపడగా, మెటల్, టెలికాం, ఆటో తదితర సూచీలు నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ విషయానికి వస్తే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (3.91%), ఇన్ఫోసిస్ (3.75%), సన్ ఫార్మా (3.59%), ఎన్టీపీసీ (3.35%), హెచ్సీఎల్ (3.26%) లు ఉన్నాయి..
ఈ రోజు నష్టపోయిన టాప్ లూజర్స్ లో యాక్సిస్ బ్యాంక్ (-5.10%), ఐటీసీ (-3.91%), ఐసీఐసీఐ బ్యాంక్ (-3.84%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.73%), మారుతి సుజుకి (-3.33%) వంటి కంపెనీలు ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్ తీవ్రంగా నష్టపోయింది . మొత్తానికి ఈ రోజు లాభాల బాటలో సాగుతుంది అనుకున్న మార్కెట్ లాభానష్టాలలో ఊగిసలాడి చివరకు ఫ్లాట్ గా ముగిసింది.


Click it and Unblock the Notifications