ముంబై: మే నెలలో బ్యాంకులకు రాబోయే సెలవులను రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీనికి సంబంధించిన జాబితాను విడుదల చేసింది. వేర్వేరు రాష్ట్రాల్లో జరుపుకొనే పండగలు, ఇతర వేడుకల ఆధారంగా బ్యాంకులకు సెలవుల జాబితాను రూపొందించింది. మొత్తం 13 సెలవులు బ్యాంకులకు రానున్నాయి. ఆదివారాలను కూడా కలుపుకొని మొత్తంగా 13 బ్యాంక్ హాలిడేలు రానున్నాయి. మే 1వ తేదీ కార్మిక దినోత్సవం ఆదివారంలో కలిసిపోయింది.
సాధారణంగా బ్యాంకు సెలవులను మూడు కేటగిరీలుగా విభజిస్తుంటుంది రిజర్వు బ్యాంక్. స్టేట్-స్పెసిఫిక్ హాలిడే, రిలీజియస్ హాలిడే, ఇతర పండగలు. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఈ మతపరమైన సెలవులు వస్తుంటాయి. దీనికి ప్రత్యేకంగా తేదీ అనేది ఉండదు. ఇలాంటివన్నీ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద మంజూరు అవుతాయి. రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన జాబితా ప్రకారం.. మే 1: కార్మిక దినోత్సవం. దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. అదే రోజు మహారాష్ట్ర రాష్ట్ర దినోత్సవం.

మే 2వ తేదీన మహర్షి పరశురామ జయంతి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంటుంది. మే 3వ తేదీన ఈద్-ఉల్-ఫితర్ దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. అదే రోజు బసవ జయంతి సందర్భంగా కర్ణాటకలో మాత్రమే బ్యాంకులు పని చేయవు. ఈ హాలిడే ఈద్-ఉల్-ఫితర్‌లో కలిసింది. మే 4వ తేదీన తెలంగాణలో ఈద్-ఉల్-ఫితర్ సెలవు ఉంటుంది. మే 8వ తేదీన ఆదివారం హాలిడే. మే 9వ తేదీన రవీంద్రనాథ్ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్, త్రిపురల్లో బ్యాంకులకు సెలవు.
మే 14వ తేదీన రెండవ శనివారం కావడం వల్ల బ్యాంకులు పని చేయవు. మే 22వ తేదీన ఆదివారం సెలవు ఉంటుంది. మే 16వ తేదీన మెర్క్యురీ పౌర్ణమి/బుద్ధ పూర్ణిమ కారణంగా బ్యాంకులకు సెలవును ప్రకటించింది ఆర్బీఐ. మే 22వ తేదీన ఆదివారం సెలవు. మే 24న ఖాజీ నజ్రుల్ ఇస్మాయిల్ జయంతి సందర్భంగా సిక్కింలో బ్యాంకులకు సెలవు. మే 28వ తేదీన 4వ శనివారం, మే 29న ఆదివారం సెలవు ఉంటుంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications