ముంబై: డిసెంబర్‌లో బ్యాంకులకు రాబోయే సెలవులను రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీనికి సంబంధించిన జాబితాను విడుదల చేసింది. వేర్వేరు రాష్ట్రాల్లో జరుపుకొనే పండగలు, ఇతర వేడుకల ఆధారంగా బ్యాంకులకు సెలవుల జాబితాను రూపొందించింది. మొత్తం 12 సెలవులు బ్యాంకులకు అదనంగా రానున్నాయి. ఆదివారాలను కూడా కలుపుకొంటే ఈ సంఖ్య 16కు చేరుతుంది. డిసెంబర్‌లో మొత్తంగా 16 రోజుల పాటు బ్యాంకులు పని చేయవు.
సాధారణంగా బ్యాంకు సెలవులను మూడు కేటగిరీలుగా విభజిస్తుంటుంది రిజర్వు బ్యాంక్. స్టేట్-స్పెసిఫిక్ హాలిడే, రిలీజియస్ హాలిడే, ఇతర పండగలు. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఈ మతపరమైన సెలవులు వస్తుంటాయి. దీనికి ప్రత్యేకంగా తేదీ అనేది ఉండదు. ఉదాహరణకు డిసెంబర్ 3వ తేదీన గోవాలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండగను నిర్వహిస్తారు. అది ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవుతుంది. మిగిలిన రాష్ట్రాల్లో బ్యాంకులు ఆ రోజు యధాతథంగా పని చేస్తాయి.

ఇలాంటివన్నీ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద మంజూరు అవుతాయి. రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన జాబితా ప్రకారం.. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద చేర్చిన బ్యాంక్ హాలిడేలు- డిసెంబర్ 3వ తేదీన గోవాలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఫీస్ట్ వల్ల బ్యాంకులకు హాలిడే ప్రకటించారు. యుసొసొ థామ్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 18వ తేదీన మేఘాలయాలో బ్యాంకులకు సెలవులను మంజూరు చేసింది ఆర్బీఐ. ఈ సెలవు మిగిలిన రాష్ట్రాలకు వర్తించదు.
డిసెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో బ్యాంకులకు ఆదివారం సెలవు ఉంటుంది. 11వ తేదీన రెండో శనివారం హాలిడే. 25వ తేదీన నాలుగో శనివారం హాలిడే ఉంటుంది. ఇది క్రిస్మస్ సెలవుతో కలిసి వచ్చింది. ఫలితంగా- ఓ హాలిడే ఓవర్ ల్యాప్ అయినట్టే. 27వ తేదీన ఐజ్వాల్‌లో క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని ఆ రాష్ట్రానికి మాత్రమే సెలవులను ప్రకటించింది రిజర్వుబ్యాంక్. డిసెంబర్ 30న యు కియాంగ్ నగ్బా సెలబ్రేషన్స్ పురస్కరించుకుని షిల్లాంగ్, 31వ తేదీన న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా ఐజ్వాల్‌లో బ్యాంకులకు సెలవులు ఇచ్చింది ఆర్బీఐ.
More From GoodReturns

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..



Click it and Unblock the Notifications