For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తలసరి జీడీపీలో భారత్‌ను వెనక్కి నెట్టనున్న బంగ్లాదేశ్.. కానీ

|

2020 క్యాలెండర్ సంవత్సరంలో తలసరి జీడీపీలో భారత్‌ను బంగ్లాదేశ్ అధిగమించనుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(IMF) తన వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్ నివేదికలో తెలిపింది. 2020లో భారత జీడీపీ 10.3 శాతం ప్రతికూలత నమోదు చేస్తుందని అంచనా వేసిన విషయం తెలిసిందే. అయితే 2021 క్యాలెండర్ ఏడాదిలో జీడీపీ 8.8 శాతం వృద్ధి సాధిస్తుందని తెలిపింది. అధే సమయంలో ప్రస్తుత క్యాలెండర్ ఏడాదిలో మాత్రం పర్ కాపిటా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ (తలసరి జీడీపీ) బంగ్లాదేశ్ కంటే తక్కువగా ఉంటుందని తెలిపింది.

2020లో బంగ్లాదేశ్‌లో తలసరి జీడీపీ డాలర్ టర్మ్స్‌లో 1,888 డాలర్లతో 4 శాతం వృద్ధి ఉండవచ్చునని ఐఎంఎఫ్ తెలిపింది. భారత్‌లో మాత్రం తలసరి జీడీపీ 1,877 డాలర్లకు పడిపోవచ్చునని పేర్కొంది. గత నాలుగేళ్లలో ఇది కనిష్టం. ఈ గణాంకాల ఆధారంగా చూస్తే దక్షిణాసియలో పాకిస్తాన్, నేపాల్ తర్వాత భారత్ మూడవ అత్యంత పేద దేశంగా ఉండనుంది. బంగ్లాదేశ్‌తో పాటు భూటాన్, శ్రీలంక, మాల్దీవులు భారత్ కంటే ముందుండనున్నాయి. ఈ ఏడాది నేపాల్, భూటాన్ వృద్ధి పెరగనుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఆసియాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ మూడో స్థానంలో ఉంది. ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ, వచ్చే ఏడాది బౌన్స్ బ్యాక్ అవుతుందని తెలిపింది.

2020లో దారుణ ఆర్థిక పతనం, వచ్చే ఏడాది చైనాను దాటనున్న భారత్2020లో దారుణ ఆర్థిక పతనం, వచ్చే ఏడాది చైనాను దాటనున్న భారత్

Bangladesh set to overtake India in per capita GDP: IMP

1990-91 తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ దారుణంగా కుంచించుకుపోనుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. సౌత్ ఏసియాలో శ్రీలంక తర్వాత తీవ్రంగా దెబ్బతిన్న దేశం భారత్ అని తెలిపింది. తలసరి జీడీపీలో 2020లో భారత్ కంటే బంగ్లాదేశ్ ముందుకు వచ్చినప్పటికీ 2021లో భారత్ తిరిగి పుంజుకుంటుందని తెలిపింది. వచ్చే ఏడాది భారత్ వృద్ధి 8 శాతం దాటనుందని, ఈ నేపథ్యంలో తలసరి జీడీపీ 2,030గా ఉండనుందని, అదే సమయంలో బంగ్లాదేశ్ తలసరి జీడీపీ 1,990కి పెరుగుతుందని తెలిపింది. అంటే వచ్చే ఏడాది తిరిగి బంగ్లాదేశ్‌ను భారత్ దాటనుంది.

English summary

తలసరి జీడీపీలో భారత్‌ను వెనక్కి నెట్టనున్న బంగ్లాదేశ్.. కానీ | Bangladesh set to overtake India in per capita GDP: IMP

India is set to slide below Bangladesh in terms of per capita GDP in 2020 owing to a steep contraction in the economy as a result of coronavirus lockdown.
Story first published: Wednesday, October 14, 2020, 13:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X