Vodafone Idea: వొడాఫోన్ ఐడియా టెలికాం రంగంలో అంబానీ జియో అరంగ్రేట్రంతో కుదేలవటం ప్రారంభమైంది. ఒకప్పుడు దిగ్గజ టెలికాం ఆపరేటర్ స్థితి నుంచి నష్టాల్లోకి జారుకుంది. ప్రస్తుతం అప్పుల ఊబిలో చిక్కుకుని అల్లాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీ మరో సంక్షోభాన్ని ఎదుర్కోవలసిన గడ్డు కాలం ఎదురైంది. ఇది కంపెనీనే కాక కస్టమర్లను సైతం ఇబ్బందుల్లోకి నెట్టనుంది.

కనెక్టివిటీ సమస్యలు..
వోడాఫోన్ ఐడియా కస్టమర్లు నవంబర్ నుంచి కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం టెలికాం దిగ్గజం టవర్ కంపెనీలకు రూ.10 వేల కోట్లు బకాయిపడింది. ఇందులో ఇండస్ టవర్ వాటా రూ.7 వేల కోట్లు. ఈ క్రమంలో బకాయి మొత్తాన్ని చెల్లించాలని ఇండస్ టవర్ వోడాఫోన్ ఐడియా కంపెనీని కోరింది. ఇండస్ కంపెనీ బకాయిలు చెల్లించకుంటే నవంబర్ నెల నుంచి వోడాఫోన్ ఐడియాకు టవర్ సేవలను వినియోగించుకోనివ్వబోమని హెచ్చరించింది. ఇది Vodafone Idea కస్టమర్‌లకు కనెక్టివిటీ సమస్యలను కలిగించవచ్చని తెలుస్తోంది.

బకాయిలపై రిమైండర్..
ఇండస్ కంపెనీ బోర్డు సమావేశంలో సంస్థ ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. ఇందులో వొడాఫోన్ ఐడియా కంపెనీపై రూ.7 వేల కోట్ల బకాయిలు ఉన్నట్లు తేలింది. అందువల్ల, అన్ని బకాయిలను చెల్లించాలని ఇండస్ కంపెనీ వోడాఫోన్ ఐడియా కంపెనీని కోరింది. లేనిపక్షంలో సేవలను నిలిపివేస్తాని హెచ్చరించింది.

ఇండస్ టవర్స్..
జూన్ త్రైమాసికంలో ఇండస్ టవర్ లాభం 66 శాతం తగ్గి రూ.477 కోట్లకు చేరుకుంది. ఈ కాలంలో దాదాపు రూ.6,200 కోట్లు వస్తాయని అంచనా వేసినా.. అది రాకపోవడంతో లాభాలు తగ్గాయని కంపెనీ పేర్కొంది. మొండి బకాయిల కారణంగా ఇండస్ టవర్స్ రూ.1,200 కోట్ల కేటాయింపులు చేయాల్సి రావడంతో కంపెనీపై ఒత్తిడి పెరిగింది.

5జీ సేవల కోసం..
Reliance Jio, Airtel తర్వాత Vodafone Idea దేశంలో మూడవ అతిపెద్ద టెలికాం కంపెనీగా కొనసాగుతోంది. ఎయిర్ టెల్, జియోలు దీపావళి నాడు 5G సేవను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే Vodafone Idea ఇప్పటి వరకు అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. సంస్థ ఆర్థిక పరిస్థితి దిగజారటంతో అప్పులు అధికంగా ఉన్నాయి. కంపెనీ నష్టాల్లో ఉన్నందున 5G సేవను ఇంకా ప్రారంభించలేదని తెలుస్తోంది. ప్రస్తుతం డెట్, ఈక్విటీ మార్గాల ద్వారా రూ.20,000 కోట్లు సమీకరించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications