ఆజాద్ ఇంజినీరింగ్ ఐపీఓ(IPO)కు భారీగా స్పందన వచ్చింది. అన్ని కేటగిరీల నుంచి మంచి డిమాండ్ లభించింది. ఈ ఐపీఓ 70.33 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయింది. అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులు(QIB) కేటాయించిన కోటాను కంటే 153.13 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయింది.
అధిక నెట్‌వర్త్ వ్యక్తులు (నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు) 79.71 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్లు 21.32 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయింది.
రూ. 4 కోట్ల విలువైన షేర్లను ఉద్యోగులకు రిజర్వేషన్ చేశారు. ఇది కూడా 11.80 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయింది.
తెలంగాణకు చెందిన ఆజాద్ ఇంజినీరింగ్ ఇంజినీర్డ్ ప్రెసిషన్ ఫోర్జ్డ్, మెషిన్డ్ కాంపోనెంట్స్ మేకర్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ.740 కోట్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. IPOలో రూ. 240 కోట్ల విలువైన షేర్ల తాజా జారీ చేసింది. రూ. 500 కోట్ల విలువైన షేర్ల ఆఫర్-ఫర్-సేల్ (OFS)ఉన్నాయి. ప్రమోటర్ రాకేష్ చోప్దార్, ఇన్వెస్టర్ పిరమల్ స్ట్రక్చర్డ్ క్రెడిట్ ఆపర్చునిటీస్ ఫండ్, ఇతర అమ్మకపు వాటాదారు DMI ఫైనాన్స్ OFSలో అమ్మకపు వాటాదారులుగా ఉన్నారు.

డిసెంబర్ 20న ప్రారంభమైన ఈ ఆఫర్‌కు సంబంధించి ఒక్కో షేరు ధర రూ.499-524గా నిర్ణయించారు. ఆజాద్ ఇంజినీరింగ్ ఇంధనం, ఏరోస్పేస్ మరియు రక్షణ, చమురు, గ్యాస్ పరిశ్రమలలో వాడే పరికరాల తయారు చేస్తుంది. ఐపీఓ ద్వారా వచ్చే డబ్బులతో రూ. 60.4 కోట్ల వ్యయంతో ప్లాంట్, మెషినరీలను కొనుగోలు, రుణాలను తిరిగి చెల్లించడానికి ఉపయోగించనున్నట్లు కంపెనీ పేర్కొంది.
డిసెంబర్ 26 చివరి నాటికి కంపెనీ ఐపీఓ షేర్ల కేటాయింపు ప్రాతిపదికను ఖరారు చేయనున్నారు. డిసెంబర్ 27 నాటికి డీమ్యాట్ ఖాతాలకు ఈక్విటీ షేర్లను క్రెడిట్ కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఆజాద్ ఇంజనీరింగ్‌లో స్టాక్ డిసెంబర్ 28న లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆజాద్ ఇంజినీరింగ్ షేర్లు గ్రేమార్కెట్ లో ప్రీమియంలో ట్రేడవుతున్నాయి. ఎగువ ధర బ్యాండ్ కంటే 65-70 శాతం ప్రీమియంతో ట్రేడవుతున్నాయని అజ్ఞాత విశ్లేషకులు తెలిపారు. గ్రే మార్కెట్ అనేది అనధికారిక ప్లాట్‌ఫారమ్.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

Stock market: ఇన్వెస్టర్ల కొంప ముంచిన మార్కెట్! ఒక్కరోజే రూ. 8 లక్షల కోట్లు ఆవిరి.. కారణాలివే!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications