దేశీయ ఐటీరంగ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్ గుడ్‌న్యూస్ చెప్పింది. బుధవారం అమెజాన్ వెబ్ సర్వీసెస్ బిజినెస్ యూనిట్(ASW-BU)ను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు క్లౌడ్‌లోకి మారే ప్రాజెక్టులను వేగవంతం చేసేలా సేవలను అందించేందుకు దీనిని ఏర్పాటు చేశారు. HCLలో ఒక విభాగంగా ఇది పని చేస్తుంది. దీనికి AWS ఇంజినీరింగ్, సొల్యూషన్స్, బిజినెస్ టీమ్స్ సహకరిస్తాయి. ఇప్పటికే HCL AWS సామర్థ్యాలపై పని చేస్తోంది. ఇందుకు దాదాపు పదివేల మంది సిబ్బందికి శిక్షణను ఇచ్చింది. భవిష్యత్తులో ఈ సంఖ్యను ఇరవై వేలకు పెంచాలని భావిస్తోంది.

రెండింతల ఉద్యోగాలు
'HCL ప్రస్తుతం ఐదు ఏడబ్ల్యుఎస్ సామర్థ్యాలను కలిగి ఉంది. AWSకు అుసరమైన పదివేలమంది కంటే ఎక్కువ మంది శిక్షణ కలిగి ఉన్నారు. భవిష్యత్తులో ఈ సామర్థ్యాన్ని 20,000కు పెంచాలని చూస్తున్నాం' అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. HCL అనేది ఏడబ్ల్యుఎస్ ప్రీమియర్ కన్సల్టింగ్ పార్ట్‌నర్. ఇది కస్టమర్లకు ఉత్తమ సేవలను అందించేందుకు, ఎండ్ టు ఎండ్ రోడ్ మ్యాప్‌ను అందించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది. మౌలిక సదుపాయాలు, అప్లికేషన్స్, డేటాను ఆధునికీకరించడంలో దృఢమైన వారసత్వం ఉంది.

స్ట్రాటెజీలో భాగం
వ్యాపారాల్లో భవిష్యత్తు టెక్నాలజీ వినియోగంలోకి తీసుకు వచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. AWS-BU అనేది తమ కంపెనీ HCL Cloud Smart స్ట్రాటెజీలో కీలక భాగమని HCL టెక్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కల్యాణ్ కుమార్ అన్నారు. కస్టమర్లను ప్రత్యర్థుల కంటే ముందు ఉండేలా బలమైన క్లౌడ్ వ్యవస్థల నిర్మాణం, ప్రతి కోణంలో సేవలు అందించడం వంటివి చేయడంలో AWS-BU సహకరిస్తుందన్నారు. కస్టమర్లకు పోటీదారుల కంటే ముందుగానే బలమైన క్లౌడ్ వ్యవస్థల నిర్మాణం, సేవలు అందించడంలో ఇది సహాయపడుతుందన్నారు.

కంపెనీ అనుభవం
AWS ద్వారా తమ విస్తృతమైన సంబంధాన్ని పెంపొందించడం ద్వారా AWS-BU డిజిటల్, సాంస్కృతిక, కస్టమర్ కేంద్రీకృత పరివర్తనలతో, రెండు కంపెనీలు అందించే సేవల్లో ఉత్తమమైన వాటిని సమన్వయం చేస్తుంది. అనుకూల క్లౌడ్ స్మార్ట్ పోర్ట్‌పోలియోను నిర్మించడంలో HCL అనుభవం, నైపుణ్యం, AWS డెప్త్, వేగవంతమైన ఆవిష్కరణలు ఆధునికరించడానికి ఉపయోగపడుతుంది.


Click it and Unblock the Notifications