ముంబై: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్.. ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌లో థర్డ్ జెన్ వాహనాలను రూపొందించనుంది. తన సరికొత్త ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్ టాటా అవిన్యను ఆవిష్కరించింది. అత్యాధునిక ఎలక్ట్రిక్ కారు ఇది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఇందులో. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల రేంజ్‌లో టాటా మోటార్స్ దీన్ని తీర్చిదిద్దుతోంది. అవిన్య కారుకు సంబంధించిన కాన్సెప్టువల్ మోడల్‌ను కంపెనీ యాజమాన్యం ఆవిష్కరించింది.

ఈవీలపై టాటా దృష్టి..
విద్యుత్ ఆధారిత వాహనాల తయారీపై టాటా మోటార్స్ దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ సెగ్మెంట్‌పై భారీగా పెట్టుబడులు పెడుతోంది. బిలియన్ల కొద్దీ డాలర్లను దశలవారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. కర్బన ఉద్గారాలను తగ్గించాలన కాన్సెప్ట్‌తో టాటా మోటార్స్ ఈ తరహా వాహనాల తయారీకి ప్రాధాన్యత ఇస్తోంది. ఈవీ ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులోకి తీసుకుని రానున్న హైఎండ్ కారు.. టాటా అవిన్య. దీనికి సంబంధించిన కొన్ని వివరాలను టాటా మోటార్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వెల్లడించారు.

30 శాతం ఈవీలపై..
2030 నాటికి కార్ల అమ్మకాల్లో కనీసం 30 శాతం వరకు ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దీనికి అనుగుణంగా తాము ఈవీ సెక్టార్‌పై దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈవీల తయారీని నాలుగింతలు చేయాలని భావిస్తోంది టాటా మోటార్స్. ఇందులో రెండు బిలియన్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. సాధారణ కార్లల్లో ఉండే అన్ని రకాల ఫీచర్లను ఇందులో కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చేలా డిజైన్ చేసినట్లు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ అండ్ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబైలిటీ విభాగం డైరెక్టర్ శైలేష్ చంద్ర తెలిపారు.

థర్డ్ జెన్ కారు..
థర్డ్ జనరేషన్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపుదిద్దుకుంటోన్న ఈ మొదటి ఎలక్ట్రిక్ వాహనం దేశీయ మార్కెట్‌లోకి విడుదల కావడానికి ఇంకో మూడేళ్ల సమయం పట్టొచ్చు. 2025 నాటికి ఇది అందుబాటులోకి రావచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. ఈ కారు పొడవు 4.3 మీటర్లు. ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌లో తన ఆధిపత్యాన్ని ప్రస్ఫూటింపజేసేలా ఈ కారు ముందు, వెనుక భాగాల్లో టీ- షేప్‌లో ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లను అమర్చింది కంపెనీ మేనేజ్‌మెంట్.

స్పోర్టీ అల్లాయ్ వీల్స్..
లగ్జరీ వాహనం రోల్స్ రాయిస్ వంటి కార్ల తరహాలో డోర్స్‌ను డిజైన్ చేసింది కంపెనీ. స్పోర్టీ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుందీ కారు. డ్యాష్‌బోర్డ్ మొత్తం ప్లెయిన్‌గా ఉంటుంది. సెంట్రలైజ్డ్ ఏసీ సిస్టమ్ దీని స్పెషాలిటీ. ఈ కారుకు సంబంధించిన పూర్తిస్థాయి వివరాలు, బ్యాటరీ కెపాసిటీ వంటి సమాచారాన్ని టాటా మోటార్స్ యాజమాన్యం ఇంకా వెల్లడించాల్సి ఉంది. 500 కిలోమీటర్ల రేంజ్‌తో దీన్ని తీర్చిదిద్దుతున్నందున హెవీ కెపాసిటీ బ్యాటరీలను అమర్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications