సగటు భారతీయ ఉద్యోగి వేతన ఇంక్రిమెంట్ 2022లో 9.1 శాతానికి చేరుకోవచ్చునని డెల్లాయిట్ సర్వే వెల్లడించింది. 2021లో ఇది 8 శాతంగా నమోదయింది. అదే సమయంలో 2020లో ఇది 4.4 శాతంగా ఉంది. కరోనా మహమ్మారి కారణంగా 2020లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోవడం, వేతనాల కోత తెలిసిందే. కరోనా కంటే ముందు అంటే 2019లో యావరేజ్ ఇండియా ఇంక్రిమెంట్ 8.6 శాతం కాగా, కరోనా ముందు ఏడాది కంటే కూడా 2022లో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐటీ, లైఫ్ సెన్సెస్‌లో అధికంగా పెరుగుదల నమోదు కావొచ్చునని తెలిపింది.

వేతనాల కోత నుండి పెంపు వరకు
2020లో కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది. వేతన పెంపు ఆగిపోవడమే కాదు, ఉద్యోగాల కోత, వేతనాల కోత, నియామకాలు నిలిచిపోవడం కనిపించింది. 2021లో వేతన పెంపులు కాస్త కోలుకున్నాయి. కరోనా ప్రత్యేక ప్రయోజనాలు అమల్లోకి వచ్చాయి. 2022లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో తిరిగి నియామకాలు పెరగడం, ఉద్యోగల వలసలు పెరిగాయి. ఉద్యోగుల వలసలు వంటి పరిస్థితులతో కంపెనీలు వేతన పెంపు విషయంలో కరోనా ముందునాటి స్థాయిని దాటేస్తున్నాయి. ప్రోత్సాహకాలు ఇచ్చి నైపుణ్యం కలిగిన వారిని నిలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నిలుపుకునేందుకు కంపెనీలు మంచి ఇంక్రిమెంట్‌ను ఆఫర్ చేస్తున్నాయని డెల్లాయిట్ ఇండియాకు చెందిన ఆనందరూప్ ఘోష్ అన్నారు.

అన్ని రంగాలు ఓకే...
డెలాయిట్ టచ్ తోహమత్సు ఇండియా 2022 వర్క్ ఫోర్స్, ఇంక్రిమెంట్స్ ట్రెండ్స్ సర్వేను చేసింది. డిసెంబర్ 2021లో దీనిని ప్రారంభించింది. 7 రంగాలు, 27 ఉపరంగాలు కలిపి 450 సంస్థల్లో సర్వేను చేశాయి. కరోనా ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ప్రభావం, సెకండ్ వేవ్ కంటే థర్డ్ వేవ్ ప్రభావం ఆర్థిక పరిస్థితిపై తక్కువగా ఉంది. దీంతో అన్ని రంగాల్లోను ఇంక్రిమెంట్స్ కనిపిస్తున్నాయి. వృద్ధి అన్ని రంగాల్లో కనిపించినప్పటికీ టాలెంట్ మార్కెట్ డిమాండ్-సప్లై డైనమిక్స్ కారణంగా పెరుగుదల రేటు భిన్నంగా ఉండవచ్చు.

రెండంకెల వేతన పెంపు
ఈ సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో 34 శాతం సంస్థలు రెండంకెల వేతన పెంపు ఇవ్వనున్నట్లు తెలిపాయి. 2021లో 20 శాతం కంపెనీలు మాత్రమే రెండంకేల వేతన పెంపు, 2020లో 12 శాతం కంపెనీలు చెప్పాయి. అన్ని రంగాల్లో వేతన పెంపు కనిపిస్తోంది. లైఫ్ సైన్సెస్, ఐటీ రంగాల్లో అధికంగా, ఫైనాన్స్ టెక్నాలజీ, ఐటీ ప్రోడక్ట్స్ కంపెనీలు, డిజిటల్/ఈకామర్స్ కంపెనీలు రెండంకెల పెంపుకు మొగ్గు చూపుతున్నాయి. వేతన ప్రోత్సాహకాలు అందరికీ ఒకేలా ఉండవు. పనితీరు ఆధారంగా ఇస్తామని 92 శాతం కంపెనీలు తెలిపాయి. సగటు నైపుణ్య ఉద్యోగి కంటే మెరుగైన పనితీరు కనబరిచే ఉద్యోగికి 1.7 రెట్ల వేతన పెంపు ఉండవచ్చు
More From GoodReturns

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు



Click it and Unblock the Notifications